పీఆర్సీ పెంపు ప్రకటనతో అంగన్వాడీలు ఆశావర్కర్ల సంబురాలు
పెన్ పవర్, మేడ్చల్సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్కెవి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్. ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడీలకు ఆశావర్కర్లు 30 శాతం పీఆర్సీ వర్తింపు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల అంగన్వాడీలు టీచర్స్ హెల్పేర్స్ ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పేర్స్ మేడ్చల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనియన్(టిఆర్ఎస్కెవి) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీచర్ గా గౌరవపదమైన పిలుపుతో పాటు వేతనాలు పెంచిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వనిదన్నారు. ఉద్యోగ ఉపధ్యారాలుతో పాటు అంగన్వాడీలకు ఆశావర్కర్లకు కూడా 30 శాతం పీఆర్సీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజగన్ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ వార్డు కౌన్సలర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment