సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఓయూ ఉద్యోగులు
తార్నాక, పెన్ పవర్
ఉద్యోగులకు 30% పి.ఆర్.సి.తో పాటు వయో పరిమితి పెంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓయూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూ పరిపాలన భవనం ప్రాంగణంలో ఓయూ ఎన్జిఓ అద్యక్షుడు మధుకర్ రాజ్ మాట్లాడుతూ తాము గత పది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ను కలిసినప్పుడు కూడా పి.ఆర్.సి.పై త్వరలో మంచి శుభవార్త ను వింటారన్నారని నేడు అది నిజమైందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం ఓయూకి బ్లాక్ గ్రాంట్స్ పెంచుతారనే ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎన్జిఓస్ ప్రధాన కార్యదర్శి ఖదీర్ ఖాన్ , రాకేష్, రవి, భీమయ్య, చంద్రమోహన్ , ఓయూలోని మూడు ఉద్యోగ సంఘాలు, పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment