నాచారం డివిజన్ లో కార్పొరేటర్ పాదయాత్ర
తార్నాక, పెన్ పవర్
నాచారం డివిజన్ అన్నపూర్ణ కాలనీ లో కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్,అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అక్కడి స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. స్థానికంగా నిర్మించే నూతన సీసీ రోడ్డు పనుల గురించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. స్థానికంగా ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టి కి తీసుకొని వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్, మల్లేష్ యాదవ్, విట్టల్ యాదవ్, భూపాల్ రెడ్డి, నరసింహ, చంద్రశేఖర్, సాయిలు, ఇంజనీర్ రూప, అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment