మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
రేణుక మాత సిద్ధోగం వేడుకలకు హాజరు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం బొప్పాపూర్ లో మూడు రోజుల పాటు జరిగే రేణుక మాత జమదగ్ని, కళ్యాణ మహోత్సవానికి మంత్రి కేటీఆర్ మంగళవారం రోజున హాజరై రేణుక మాత కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రేణుకా మాత కృపకు పాత్రులయ్యారు. అనంతరం బొప్పాపూర్ రైతు వేదిక భవనాన్ని పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి పెట్రోల్ పంపును ప్రారంభించి, అలాగే చిరుగు గోవర్ధన్ గౌడ్ తను పుట్టి పెరిగినటువంటి ఊరికి రేణుకా మాత ఆలయం వద్ద నిర్మించినటువంటి మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభించి , చిరుగు గోవర్ధన్ గౌడ్ బొప్పాపూర్ గ్రామానికి చేస్తున్న సేవ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జడ్పిటిసి చిటి లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక,రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ తోట ఆగయ్య, గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎంపీటీసీ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు ,గౌడ కుల బాంధవులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment