Followers

వేములవాడ బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

 వేములవాడ బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక..

అధ్యకుడిగా పిట్టల భూమేష్, ప్రధాన కార్యదర్శిగా పెంట రాజు..


వేములవాడ, పెన్ పవర్

వేములవాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు శనివారం వారి కార్యాలయంలో జరిగాయి. ఏడాదికి ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా, గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు.ఈ సారి అధ్యక్ష పదవికి పిట్టల మనోహర్, పిట్టల భూమేష్ లు పోటీ పడ్డారు.దీంతో ఎన్నికల అధికారి రేగుల దేవేందర్  పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 85 ఓట్లకు గాను 79 పోలయ్యాయి. పిట్టల భూమేష్ కు 48 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మనోహర్ కు  31 ఓట్లు వచ్చాయి. బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శిగా పెంట రాజు, సంయుక్త కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణరెడ్డి, కోశాధికారిగా దివాకర్, లైబ్రరీ సెక్రటరీగా సంటి సృజీవన్ ,క్రీడా కార్యదర్శిగా రజనీకాంత్, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా     గుజ్జ మనోహర్, బొజ్జ మహేందర్,బొడ్డు ప్రశాంత్,జూనియర్   కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్,  కాతుబండ నర్సింగరావు, రెగుల రాజ్ కుమార్ లు ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ సీనియర్ అడ్వకేట్ లింగాల నారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...