హక్కుల పై అవగాహన పెంచుకోవాలి
రామకృష్ణాపూర్, పెన్ పవర్వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షులు న్యాయవాది రాజలింగు మోతె అన్నారు. సోమవారం అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులు, రక్షణ చట్టాలు ముద్రించిన కరపత్రాలను రామకృష్ణ పూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో పంపిణీ చేస్తూ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని పలు సంస్థలు, వ్యక్తులు వివిధ రకాలుగా మోసాలకు గురిచేస్తున్నారని, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నిత్యం ఏదో ఒకచోట మోసానికి గురౌతున్నారని అన్నారు. కొనే ప్రతీ వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోతున్నాయని పేర్కొన్నారు. త్రాగే పాల నుండి ప్రతీది కల్తే. వినియోగదారుడు మార్కెట్ లో ఏది కల్తీ నో,నకిలీ నో ,ఏది నాణ్యమైనదో గుర్తించ లేక పోతున్నారని అన్నారు. ఈ తరహా మోసాల నుండి వినియోగదారుడు తనను తాను రక్షించు కొనేందుకు ఏ వస్తువు కొన్నా రశీదు తీసుకోవాలని సూచించారు. ఏ తరహా మోసం నుంచయినా వినియోగదారులకు అది కవచంలా ఉపయోగపడుతుందని తెలిపారు. గుండుపిన్ను కొన్నా రశీదు తీసుకోవడం మరువద్దని అన్నారు. ఒకవేళ వినియోగదారుడు నష్టపోయి నప్పుడు సత్వర న్యాయం, నష్ట పరిహారం పొందేందుకు ఇదే ఆయుధ మౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సంపత్, శ్రీనివాస్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment