దాతృత్వం చాటుకున్నా యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు
లక్షెట్టిపెట్, పెన్ పవర్మండలంలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్యంపేట్ గ్రామానికీ చెందిన యువరాజ్యం స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు గొర్రె రామ్ లక్ష్మణ్ లు దాతృత్వం చాటుకున్నారు.ముత్యంపేట్ గ్రామంలో గల పోచమ్మ అలయంకు తమ సొంత ఖర్చులతో పదహారు వేల నూట పదహరు రూపాయలతో బాగుచేసి తమలో భక్తీ భావం ఉందని నిరూపించుకున్నారు.ఆలయంకి రంగులు వేయించారు.గతంలో నుంచి రామ్ లక్ష్మణ్ లు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఆలయం చుట్టూ రంగులు వేయించి దేవతా మూర్తుల చిత్రలను అందంగా వేయించారు.ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసి ఆలయంలో ఆలయం చుట్టూ విద్యుత్ బల్బులను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు.ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలు చేస్తున్న రామ్ లక్ష్మణ్ ని పలువురు అభినందించారు.

No comments:
Post a Comment