Followers

కెకె రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ

 కెకె రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

జీవీఎంసీ ఎన్నికల్లో  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన శుభసందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద నుండి నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో విజయోత్సవ భారీ బైక్ ర్యాలీ  నిర్వహించారు.

 ఈ ర్యాలీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి నియోజకవర్గ పరిధిలో  గల బి ఎస్ లేఔట్, సీతమ్మధార, సత్యం జుంక్షన్, గురుద్వార్ , సీతమ్మపేట, లలితానగర్, అక్కయ్యపాలెం మహారాణి పార్లర్, 80 ఫీట్ రోడ్, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి, మర్రిపాలెం, ఆర్ అండ్ బి, దగ్గర మారియట్ హోటల్, మాధవదార మురళీనగర్ ఎన్ జి జి ఓ యస్ కాలనీ,పట్టాభిరెడ్డి గార్డెన్, పోలీటెక్నికల్ కాలేజ్, ఊర్వశి హైవే, తాటిచెట్లపాలెం హైవే , కైలాస పురం, గణేష్ నగర్, నరసింహనగర్, ఉత్తర నియోజకవర్గ కార్యాలయం వరకు  విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కె కె రాజు తో పాటు నియోజకవర్గ పరిధిలోని కొర్పొరేటర్ లు,వార్డు అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...