సంకె శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి సిఐటియు
మందమర్రి, పెన్ పవర్రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా శనివారం వేలాల వద్ద గోదావరి నదిలో సంకె శ్రీనివాస్ మరణించడం జరిగిందని అతని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు వేస్తూ లక్షల రూపాయలు ఆర్జించారని, గోదావరి నదిలో ఇసుక తీసే క్రమంలో 15 నుండి 20 ఫీట్ల లోతు వరకూ ఇసుక తీయడం వలన, నదిలో గుంతలు ఏర్పడి, తెలియక నదీ స్నానానికి వెళ్లిన శ్రీనివాస్ చనిపోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి శ్రీనివాస్ భార్య, మానసిక వికలాంగులైన అతని పిల్లలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, రాష్ట్ర నాయకులు రామగిరి రామస్వామి, నాయకులు ఐలయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment