నాడు-నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు. ఐటిడిఏ పీఓ వెంకటేశ్వర్
పెన్ పవర్,విశాఖపట్నంనాడు నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ( ఐ టి డి ఏ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల హెచ్చరించారు. శుక్రవారం తమ కార్యాలయంలో ఇంజనీరింగ్ విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతానికి 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో మనబడి నాడు నేడు కార్యక్రమాలు నడుస్తున్నాయి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. నాడు నేడు పనులు ఏజెన్సీ ప్రాంతంలో నత్తనడక నడుస్తున్నాయి. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎన్ని మార్లు హెచ్చరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకు నీరెత్తినట్లు లేదన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవని వాదనలు వినిపిస్తున్నారు అని ప్రభుత్వం అంచనాల మేరకే నిధులు మంజూరు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు మనబడి కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. నాడు నేడు నిధులు పరిపూర్ణంగా పనులు కేటాయించాలని లేనిపక్షంలో క్రిమినల్ కేసులకు గురవుతారని ఆయన అన్నారు. గడువు నాటికి నాడు నేడు పనులు పూర్తిచేయాలని పి ఓ ఆదేశించారు.

No comments:
Post a Comment