శివాలయంలో పోటెత్తిన భక్తులు
గూడెంకోత్తవీధి,పెన్ పవర్ మండలంలోని జికేవీధి,ఆర్వీనగర్,మంగళపాలెం శివాలయలలో గురువారం మహాశివరాత్రి సంధర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్వీనగర్ లో ఉదయం కందిరీగలు భక్తులకు దాడిచేయడం తో చింతపల్లి మండలంలోని అంతర్ల శివాలయనికి వెళ్లారు.దేవరాపల్లి పంచాయితీ మంగళపాలెం గ్రామంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు .ఆ గ్రామంశివలయనికి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ ప్రసాదం అందించారు. దేవరాపల్లి సర్పంచ్ సిరిబాలబుజ్జిబాబు దంపతులు, గిరిజన సంఘం మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ కుటుంబ సభ్యులు శివలింగాన్ని ధశించుకున్నారు.

No comments:
Post a Comment