నక్కా ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తాళ్ళపూడి, పెన్ పవర్వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాళ్ళపూడి గ్రామ పంచాయితీ సర్పంచ్ నక్కా వెంకట అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మెయిన్ రోడ్ మదనగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి సర్పంచ్ అనూరాధ పూలమాల వేశారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పార్టీలో తప్పకుండా భవిష్యత్తు ఉంటుందన్నారు. సర్పంచ్ నక్కా వెంకట అనురాధ కేక్ కటింగ్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గోలి వీర వెంకట సత్యనారాయణ, ఎఎంసి డైరెక్టర్ కంకిపాటి బాబురావు, వైయస్సార్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, వైయస్సార్సీపీ నాయకులు నక్కా ఆనంద్, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, గూడా విజయరాజు, సిద్దంశెట్టి కృష్ణ, మైగాపుల రాజారావు, బండారు సత్తిబాబు, చిట్టాల రాము, కోదాటి సత్యనారాయణ, బ్యాంక్ సత్యనారాయణ, కొక్కిరాల గాంధీ, మైగాపుల ఆంజనేయులు, నాయుడు రత్నాజీ, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment