విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి
విజయనగరం,పెన్ పవర్వివిధ సచివాలయాల్లో సమయపాలన పాటించని 8 మంది కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మెమోలు జారీ చేశారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని 46, 47, 48 నెంబరు గల సచివాలయాలను కమిషనర్ పరిశీలించారు. నిర్ణీత సమయానికి విధులకు హాజరు కాని 8 మంది కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలని కార్యదర్శులకు ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా సమయపాలన పాటించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించడం, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో సచివాలయ వ్యవస్థ రూపొందించిందని, అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు తేవాలని చెప్పారు.
No comments:
Post a Comment