జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు
జగిత్యాల, పెన్ పవర్
జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సలు మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించిన శ్రీమతి దావ వసంతసురేష్,చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల 100 పడకల సామర్థ్యము గల జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి నకు వివిధరకాల అనారోగ్య సమస్యలతో జిల్లా నలుమూలల నుండి వేలాది మంది నిరుపేదలు వైద్యము నిమిత్తం రావడం జరుగుచున్నది. చాలామంది నిరు పేదలు అవగాహన రాహిత్యముతో ఆత్రుతతో దూరపు కొండలు నునుపు అనే నానుడి మాదిరిగా దూర ప్రాంతములలో నున్న కార్పోరేట్ ఆసుపత్రులలోనే నాణ్యమైన చికిత్సలు అందుబాటులో ఉంటాయని ఎవరో చెప్పిన మాటలను విని అనేక వ్యయ ప్రయాసలకు లోనై పలు ఇబ్బందులు పడుచుచుండడం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో చురుకైన యువ డాక్టర్లు అంకిత భావముతో పేద ప్రజలకు కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు చేపట్టడం హర్షనీయమని శ్రీమతి దావ వసంతసురేష్, చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల సంతోషం వ్యక్తం చేసినారు. ఇటివల జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన అనిరుద్ అనే రెండు నెలల అబ్బాయికి కడుపులో పేగు జారుడు (అబ్ స్ట్రక్ టెడ్ హెర్నియా) శస్త్ర చికిత్స విజయ వంతముగా నిర్వహించడం పట్ల శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు డా.గంగాధర్ రెడ్డి, Mch (పెడిత్రియాటిక్ సర్జన్), డా.కళ్యాణ్,యం.డి.అనేస్తిషియగారల సేవలను గుర్తించి శ్రీమతి దావ వసంతసురేష్, చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల అభినందిస్తూ వారిని శాలువ తో సత్కరించడం జరిగింది. అదేవిధముగా, ఇటివల ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధి తో బాధపడుచున్న 6 నెలల బాబు కు ఎంపైమా థారిక్స్ వ్యాధి సర్జెరీ తో చికిత్స చేయడం జరిగింది. మరొకరికి మోషన్ వెళ్ళే పేగు లేకపోవడం వలన ఆపరేషన్ చేసి ప్రేగును క్రిందికి తీసుకు రావడం మొదలగు ఆపరేషన్లు విజయవంతముగా పూర్తిచేయడం పట్ల శ్రీమతి దావ వసంతసురేష్, చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు చేపట్టుచున్న సమస్త వైద్య అధికారులందరి మరియు సిబ్బందిని సేవలను ఈ సంధర్బంలో కొనియాడారు. రాబోయే రోజులలో కూడా ఇలాంటి మెరుగైన సేవలను అందించి జగిత్యాల జిల్లా పేరును రాష్ట్రములో అగ్రగామిగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

No comments:
Post a Comment