పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గుడిహత్నూర్,పెన్ పవర్
గుడిహత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుడిహత్నూర్ ఎస్సై ఎల్. ప్రవీణ్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు మాన్కపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కు గత కొన్ని రోజులుగా తమ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.మంగళవారం సాయంత్రం 5:30 గం. ల సమయంలో ఆయనకు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments:
Post a Comment