వ్యాపారమే కాదు భక్తి భావంతో సమాజ సేవ చేయాలి
పెన్ పవర్,ఆలమూరుప్రస్తుత కాలంలో చుట్టాలకి స్నేహితులుకి పక్కింటి వారికి కూడా గుప్పెడు అన్నం పెట్టడానికి వెనకడే మనుషుల మధ్య బతుకుతున్నాం, వ్యాపారం దృక్పథాన్ని పక్కనపెట్టి భక్తి భావంతో సమాజసేవ చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ కమిటీ చేస్తున్న బారి అన్నదాన సేవలు అభినందనీయమని ఆలమూరు మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ (ఏఎంసీ) తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, మండల కన్వీనర్ తమ్మన శ్రీను అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్ ప్రాంగణంలో సుమారు 20 వేల మందికి బారీ అన్నదానం చెయ్యటం చాలా హర్షించదగ్గ విషయమనారు. మా ఆలమూరు మండలంలోని మనుష్యులు మాత్రంమే సేవ చేయడానికి పోటీపడతారని, ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల బాటసారులకు మన గోదారోళ్లు చేసిన సేవలే ఇందుకు ఉదాహరణ అని మరలా భక్తి భావంతో ఇలా అన్నదానం చేయడం మరోసారి రుజువైందని అన్నారు. అనంతరం కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులను ఏఎంసీ చైర్మన్ తమ్మన దంపతులు సన్మానం చేయగా తమ్మన దంపతులతో పాటుగా మడికి సర్పంచ్ ఉప సర్పంచ్ లను కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయాంజనేయ స్వామి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ చైర్మన్ పాలూరి సత్తిబాబు, దొండపాటి సుబ్బరాజు, చెల్లుబోయిన సింహాచలం, అయినివిల్లి సత్తిపండు, పర్వతనేని రామారావు (అబ్బు), దొండపాటి వెంకన్న, కొత్తపల్లి నాగేశ్వర్రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు యనమదల నాగేశ్వరరావు, పడమటి రాంబాబు, అడ్డాల సత్యనారాయణరాజు, చెల్లుబోయిన శ్రీనివాస్, మల్లెమొగ్గల చిన్న, పలువురు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment