Followers

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు

 శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు







 

పెన్ పవర్,ఆలమూరు 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హరహర మహాదేవ శంభో అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు  మారుమ్రోగాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ సోమేశ్వరస్వామి, మూలస్థాన అగ్రహారంలో గల శ్రీ ఉమా ముాలేశ్వర స్వామి, చొప్పెల్లలో శ్రీ పార్వతీ మల్లేశ్వరస్వామి వారు, ఆలమూరు శ్రీ పార్వతి విక్రమ బట్టేశ్వర స్వామి,  జొన్నాడలో గల ఉమా మల్లేశ్వరస్వామి, పెనికేరు ఇష్ట కాంతేయ స్వామి, చింతలూరు ఉమా పృధ్వీశ్వరస్వామి, పెద్దపల్ల ఉమా మల్లేశ్వరస్వామి, నర్సిపూడి పార్వతి సోమేశ్వరస్వామి వారి  ఆలయాల్లో తెల్లవారు జాము నుండి  ఆది దంపతులకు ప్రత్యేక తైలాభిషేకాలు నిర్వహించారు. ఆయా ఆలయాల కార్యనిర్వాహక కార్యదర్శులు భక్తుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆదిదంపతుల దర్శనానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను పలువురు భక్తులు అందజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...