కరోనా తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ... ఎస్సై సాయన్న
బేల, పెన్ పవర్కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సాయన్న పేర్కొన్నారు. బుధవారం బేలా మార్కెట్ నందు కోవిడ్ - 19 అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యాపారులు, ప్రజలు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా మాస్క్ ధరించాలని, కరోనా విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు మాస్క్ దరించని యెడల విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టుకు పంపటం జరుగుతుందని అన్నారు. వారి వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment