సమైక్య నాయకురాళ్ళను సన్మానించిన విశాల్ గౌడ్
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
గాజులరామారం డివిజన్ పరిధిలోని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ప్రపంచ కన్జ్యూమర్ రైట్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా, గోల్డెన్ మహిళా సంఘం సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టిఆర్ఎస్ నాయకుడు కే.పీ.విశాల్ గౌడ్ ముఖ్యాతిథిగా హాజరయ్యారు.. 30 మంది సమైక్య నాయకురాళ్లను విశాల్ గౌడ్ శాలువాతో సత్కరించారు..ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డ్వాక్రా రుణాలను సమైఖ్య నాయకురాళ్లు , మహిళలకు రుణాలు అందేలా కృషి చేయాలని సూచించారు..రుణాలు పొందిన మహిళలు తమ తమ వ్యాపారాలను అభివృద్ధి పర్చుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాజులరామారం సర్కిల్-26, డిప్యూటీ కమిషనర్ రవీందర్, సి.ఓ.లు హరిప్రియ, ఇందిరా, మురళి, ప్రసాద్ మరియు దివ్య జ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి,, గోల్డెన్ మహిళా స్లం సమైక్య అధ్యక్షురాలు షబానా బేగం, సి.ఆర్.పి. నజియా బేగం, సమైక్య నాయకురాలు లక్ష్మి, శివపార్వతి, బుచ్చమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment