అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక ఆహార సదస్సు...
నార్నూర్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా గాడిగూడ మండల కేంద్రంలోని ధాబా(బి)గ్రామ పంచాయతీ లో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో శిశు సంక్షేమ పై గర్భని స్త్రీ లకు, బాలింత మహిళా లకు, చిన్నారిలలో పౌస్టిక ఆహారం పై గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ జాదవ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బెటి పడవో బెటి బచావో ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లని 14 సవంత్సరాలు లోపు ఉన్న పిల్లలను పనిలో పెట్టారాదన్నారు.ఆడపిల్లని చక్కగా చదివించాలని,18 సవంత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలన్నారు. బాల్యవివాహాలు అరికట్టాలని పిలుపునిచ్చారు.ఆడపిల్లల సంరక్షణ కోసం 100,181,1089,టోల్ ప్రి కు సంప్రదించాలి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ అందరు మాస్క్ లు ధరించి, శానిటైజర్ వాడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నపిల్లలకు అట వస్తువు సమాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ లు, అయలు, బాలింతలు, చిన్నారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment