కరోనా పట్ల అపోహలు వద్దు అవగాహన ముఖ్యం:డాక్టర్ రవి
చిన్నగూడూరు, పెన్ పవర్స్థానిక మండల కేంద్రంలోని ఉగ్గంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిబ్బందికి డాక్టర్ గుగులోతు రవి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం డ్యూటీ లో ఉండే పోలీస్ వారికి కరోనా టెస్టు లు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నగూడూరు యస్.ఐ. విజయ్ రాంకుమార్ తో పాటు వారి సిబ్బంది 9 మందికి కరోనా టెస్ట్ చేయగా అందరికి నెగటివ్ రావడం జరిగింది. ఈ రోజు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 27 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగటివ్ వచ్చినట్లు వైద్యులు డాక్టర్ రవి తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ లు ఉపయోగించాలి అని అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంరలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నన తరుణంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ వైద్యుల సలహాలను సూచనలను అనుసరిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి తో పాటు స్టాఫ్ నర్స్ నసీమ, ఏఎన్ఎం ఎస్తర్ రాణి, ఆశ జ్యోతి పాల్గొన్నారు.

No comments:
Post a Comment