హమాలీ కార్మికులకు ఎల్ల వేళలా అండగా ఉంటాం:టి ఆర్ కే ట్రస్టు వ్యవస్థాపకులు
వేములవాడ,పెన్ పవర్ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి తన వంతు సహాయసహకారాలు అందిస్తున్న టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ కు రోజు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు, యువకులు మీ వెంటే మేమంటూ స్వచ్ఛందంగా ముందుకువచ్చి టి ఆర్ కె ట్రస్ట్ లో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం వేములవాడ పట్టణానికి చెందిన హమాలి కార్మిక సంఘం వారు తరలివచ్చి తోట రామ్ కుమార్ ను స్వయంగా కలిసి, ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ లో తమ వంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు అన్ని వేళల్లో అండగా ఉంటూ కష్టసుఖల్లో పలు పంచుకుంటానని అన్నారు. అలాగే హమాలి కార్మిక సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
తోట రామ్ కుమార్ ను సన్మానించిన ఆర్ఎంపీలు..
వైద్య రంగంలో ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని టి ఆర్ కె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలకు గుర్తుగా ఆర్.ఎం.పి లు ఆదివారం వేములవాడ పట్టణములో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను కాపాడటంలో ఆర్.ఎం.పి లు తీవ్రంగా కష్టపడుతున్నారని, ముఖ్యంగా కరోన కష్ట కాలములో ప్రజలకు ధైర్యం చెప్పడంలో ఆర్.ఎం.పి లు కీలకంగా వ్యవహరించారని, వారికి తమ ట్రస్ట్ సహాయసహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్, వర్కింగ్, ఎంక్వయిరి టీం సభ్యులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment