Followers

ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయండి

 ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయండి 

నీటిని పొదుపు చేసి సంరక్షించండి...రూపాకుల రవికుమార్ 

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ గాయత్రీ వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం   ఆవరణలో  కొత్తగా నిర్మించిన  3వ ఇంకుడు గుంతను ప్రారంభించారు.ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ రానున్న రోజులలో నీటిని పొదుపు చేయటమే లక్ష్యంగా మహిళలు ముందుకు సాగాలని నీటి కోసం పక్క రాష్ట్రముల వారితో విభేదాలు రాకుండా ,నీటి యుద్ధాలు జరగకుండా నీటిని పొదుపు చేసుకోవాలని అన్నారు.ఇంకుడు గుంతల లోకి  నిత్యము వాడుకునే నీరు మరియు వానల ద్వారా వచ్చిన నీరు చేరే లాగా నిర్మించాలని  అన్నారు.  

ఆరు అడుగుల లోతు లో సుమారు మూడడుగుల  వెడల్పుతో  ,ఇంకుడు గుంతను తవ్వించి ,40ఎమ్.ఎమ్.మెటల్, 20ఎమ్.ఎమ్.మెటల్ , ఇసుక మరియు 10ఎమ్.ఎమ్ మెటల్ తోటి ఇంకుడు గుంతను మూడు వంతుల వరకు నింపాలని అన్నారు.సుమారు  ఒక్కొక్క ఇంకుడు గుంత కు 12  వేల నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుందని అన్నారు.దుబారా నీటి వాడకం తగ్గించాలని ,బహుళ అంతస్తుల్లో కనీసం ఆరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అన్నారు.నీటి ఎద్దడి నుంచి ఆనాడే మనకు రక్షణ కలుగుతుందని సూచించారు.

ముఖ్యముగా విశాఖ నగరంలో ఎండాకాలంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుందని ఈ సమస్యకు పరిష్కారము  ప్రతి ఇంటా ఇంకుడు గుంతల ఏర్పాటు చేయాలని  అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి ,ఎస్ మహేష్ ,ఎస్ చాతుర్య ,గేదెల శ్రీహరి,హిమబిందు, డాక్టర్ వైలక్ష్మణరావు,శంకర్రావు,మాధవి మొదలగువారు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...