నిర్మిస్తున్న భవనాలు మరియు నర్సరీ మొక్కలను పరిశీలించిన కలెక్టర్ వి.పి గౌతమ్
పెన్ పవర్, మరిపెడ
మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీలో గురువారం వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చిన మహబూబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ మరిపెడ లో ప్రభుత్వ అభివృద్ధి పనులను నిర్మిస్తున్న భవనాలను ఆడిటోరియం, వెజ్ నాన్వెజ్ మార్కెట్ భవనం, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ భవనం, పెళ్లిళ్లకు ఇతర వేడుకలకు వినియోగించుకోవడానికి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవనం పనులను చేపట్టాలని కలెక్టర్ వి.పి గౌతమ్ సందర్శించి పరిశీలించారు. అనంతరం వైకుంఠధామం( స్మశాన వాటిక) పనులను పరిశీలించి చిన్న చిన్న పనులు త్వరగా చేయాలన్నారు. మరియు నర్సరీని సందర్శించి మొక్కలు నాటే అప్పుడు ప్రతి మొక్క మూడు అడుగులు ఉండాల్సిందేనని అలాగే అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు ఐదు అడుగులు తప్పుని సరిగా ఉండాలన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో నుండి మొక్కల కొనుగోలు ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సింధూర, తాసిల్దార్ రమేష్ బాబు, మరిపెడ మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబు, వార్డ్ కౌన్సిలర్ లు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment