Followers

గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో...పిచ్చుకల పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం

 గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో...పిచ్చుకల పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ పురస్కరించుకొని పిచ్చుకల సంతతి పెరగడానికి పిచ్చుక పరిరక్షణ కార్యక్రమాన్ని  గ్రీన్ క్లైమేట్ టీం తరపున రత్నం సోమవారం పెద్ద జాలరి పేట లోనీ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో  ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ నగరంలో పిచ్చుకలు కనిపిస్తున్న ప్రాంతాల సంఖ్య చాలావరకు పెరిగిందని, నగరంలోని వివిధ పాఠశాలల్లో ను, కళాశాలల్లోనూ మార్చి 20 తేదీ ( ప్రపంచ పిచ్చుకల పరిరక్షణా రోజు) వరకు పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమాలు, ఆహారం, నీరు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించడం అవి గుళ్ళు పెట్టుకోవడానికి అవసరమైనా మట్టి గూ ళ్లు, కొబ్బరి బొండాల తో, వెదురుతో గూళ్ళు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే  పక్షులు గూళ్ళు పెట్టే, పక్షు లకు ఆహారం ఇచ్చే చెట్లు పెంచడం, విత్తనాలు సేకరించి విత్తన బంతుల తయారుచేసి కొండల మీద చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రసాయనాల వల్ల నానాటికీ పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోందని అన్నారు. మన వంతుగా పిచ్చుకల పరి రక్షణ లొ భాగంగా ఇళ్ళల్లో పిచ్చుక గూళ్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రపంచ పిచ్చుకల రోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే   పిచ్చుకల, ఇతర పక్షుల సంరక్షణ ర్థం పనిచేసే ప్రజలకు ఒక వేదికను ఏర్పాటు   చేయడం, పిచ్చుకలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గల మానవ ఆవాసాల తో గట్టి సంబంధాన్ని కలిగి ఉంటాయి అందుచేతనే వాటిని ఇంటి పిచ్చుక అని అంటారు అన్నారు. పక్షులు గూళ్ళను పెట్టుకోవడానికి వీలుగా ఉండే చెట్లను  పెంచడం, ధాన్యపు కంకులను    వేలాడదీయడం, ఈ మంచి పనిలో పిల్లలను భాగస్వామ్యులుగా చేయమన్నారు. దీనిద్వారా వారికి వృక్షజాలం,జంతు జాలం,జీవ వైవిధ్యం ప్రాముఖ్యత తెలుస్తుందని అన్నారు.ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన చిన్నారులకు అందజేద్దామన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలప్రధానోపాధ్యాయులు  రవి సిద్ధార్థ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు ఫ్లకార్డులు ఇచ్చి  పిచ్చుకల ను సంరక్షిద్దాం  పిచ్చు కల సంతతి  పెరగడానికి కృషి చేద్దాం అనే నినాదం  చేయించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...