విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి
జీవో నంబర్ 3 పునరుద్ధరించాలిరైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
గిరిజన సంఘం.ఎస్. ఎఫ్. ఐ.ధర్నా
పెన్ పవర్,విశాఖపట్నం
కేంద్రంలో నరేంద్ర మోడీ,(బీజేపీ) చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా సోమవారం హుకుంపేటలో గరిజన సంఘం ఆద్వర్యంలో విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, జీవో నంబర్ 3 పునరుద్ధరణ చేసి గిరిజన హక్కులు,100 శాతం ఉద్యోగాలు గిరిజనుల కే ఇవ్వాలని,దేశవ్యాప్తంగా రైతులకు నష్టం చేసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ, ర్యాలీ ,ధర్నా జరిగింది.ఈ కార్యక్రమంలో గిరిన సంఘం మండల నాయకులు పాంగి సోమన్న నేతృత్వంలోజరిగిన కార్యక్రమంలో సోమన్న,డూరు కృష్ణమూర్తి లు మాట్లాడుతూ దేశంలోని అన్నీ ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు చేస్తూ,ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి,నిరుద్యోగం పెరిగి, ప్రజలు తీవ్ర దారిద్రం లో వెళ్లేలా కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.తక్షణమే స్టీల్ ప్లాంట్ అమ్మకం ,ప్రైవేటి కరణ ఆపాలి,జీవో నంబర్ 3 పునరుద్ధరణ చేసి ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందేలా చెయ్యాలి.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి,భూమి రక్షణ కల్పించాలి,2020 విద్యుత్ చట్టం రద్దు చెయ్యాలని డిమాండ్ లతో ర్యాలీ,ధర్నా జరిగింది.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి స హైమావతి, సీపీఎం లీడర్ సుడిపల్లి కొండలరావు, గిరిజన సంఘం మండల నాయకులు వి లక్ష్మణ్ రావు,డి కృష్ణమూర్తి, పాంగి సోమన్న ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment