గోలగాని గెలుపు.......అభివృద్ధికి మలుపు
హరి వెంకట కుమారి ఘన విజయంప్రజలు, కార్యకర్తలు ఆనందోత్సాహం
విశాఖ పొలిటికల్, పెన్ పవర్
విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆరిలోవ 11 వ వార్డు వై.ఎస్.ఆర్. పార్టీ అభ్యర్థిని గోలగాని హరి వెంకట కుమారి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం నాది కాదని, వార్డు ప్రజలదే అని చాటి చెప్పారు. సి.ఎం. జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల వలన , తన భర్త గొలగాని శ్రీనివాస్ సేవా కార్యక్రమాల వలన ప్రజలు నన్ను 4850 ఓట్ల మెజారిటీతో గెలిపించి పట్టం కట్టారని వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ,కులమత ప్రాంతీయ బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజాలకూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని విశాఖ నగరంలోనే ఆదర్శవంత మైన వార్డుగా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేశారు.

No comments:
Post a Comment