పల్లెల రూపు రేఖలు మార్చిన పల్లె ప్రగతి గ్రామ వికాసo బుగ్గరాం మండల జడ్పీటీసీ బాదినేని రాజేందర్
బుగ్గారం, పెన్ పవర్
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా బుగ్గరాం మండలంలోని గోపులాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి గ్రామ వికాసo. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బుగ్గరాం మండల ఎంపీపీ బాదినేని రాజమణి జడ్పీటీసీ బాదినేని రాజేందర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ప్రజా ప్రతినిధులు అధికారులు పనిచేయాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్నీ చేపట్టి నేల రోజుల పాటు దీని పై పని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ద్వారా అనేక సమస్యలకు శాశ్వత చూపించిన సంగతి అందరికీ తెలుసు తెలంగాణ రాష్టం రాక ముందు గ్రామాలు ఎలా ఉండేవో మనకు తెలుసు అనంతరo జడ్పీటీసీ బాదినేని రాజేందర్ గ్రామంలో పలు వార్డులను సందర్శిoచి,పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఒక నెల రోజులలో ఎవరైతే ఈ గ్రామ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి వారి ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు పరిశీలించి ఉన్నట్లయితే వారు ఎవరినైనా కావచ్చు ఒంటరి మహిళ ఫించన్ కావచ్చు వికలాంగులు కావచ్చు గీత నేత కార్మికులకు ఎవరైనా మరి వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళoదరు కూడా ఫించన్ వస్తుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా చాలా రోజుల నుంచి కొత్త వాళ్ళ కు ఇవ్వలేదు కుటుంబం లో కొంతమంది పిల్లలకు పెళ్లిళ్లు ఇవాళ కూడా కార్డు కావాల్సిన వాళ్ళవి కూడా మన ముఖ్యమంత్రి చెప్పిన కొద్దీ సమయంలో ఒక కొత్త రేషన్ కార్డులు అమలు జరిగితే చాలా పెద్ద సమస్య తీవ్రత మరి ముఖ్యంగా పేదలకు పెదవాళ్ళుకు సంబంధించిన సమస్య ఇది ఎంతోమందికి ఆదర్శoగా నిలిచినటువంటి సమస్య కాబట్టి అవి కూడా రెండు తీరిపోతాయన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పనితీరు ఇంకుడు గుంతల నిర్మాణం తడిచెత్త, పొడిచెత్త,వేరు చేయు విధానం పల్లె ప్రకృతివనం నాoపేడ్ కాoపోస్టు నిర్వహణ సంక్షేమ ఫలితాలు ఇంకా ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమ్మినేని సుశీల-నారాయణ వైస్ ఎంపీపీ సుసెంధర్ బుగ్గరాం మండల రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణ రావు ఉప సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి ఎంపీపీ కో ఒఫ్షన్ సభ్యులు రహమాన్ టిఆర్ఎ స్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం తహసీల్దార్ ఫారూఖ్ ఎంపీడీఓ తిరుపతి ఎంపిఓ అబ్దుల్ మియా వివిధ హోదాల్లో ఉన్నా నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment