నేడు కొత్తపల్లి లో ఉచిత వైద్య శిబిరం..
గోకవరం,పెన్ పవర్గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాడు కొత్తపల్లి గ్రామం మెయిన్ రోడ్డు నందుగల రైటర్ ఇంటి ఆవరణలో శ్రీరామ సత్య క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ క్లినిక్ వైద్యులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వైద్య సేవలు అందిస్తారని క్లినిక్ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా రోగులకు అవసరమైన మందులను పూర్తిగా ఉచితంగా అందజేస్తామని, రోగికి అవసరమైన రక్త పరీక్షలు సగం రేట్లకే చేస్తామని, రోగికి అవసరమైన ఏ రకమైన వైద్య సేవలైన పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలిపారు. కాబట్టి కొత్తపల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య తెలిపారు.

No comments:
Post a Comment