తాణాం లో ఘనంగా నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలు
పరవాడ,పెన్ పవర్
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తాణాం గ్రామంలో శ్రీమతి&శ్రీ కన్నూరు దేవి వెంకటమణ(నూతన సర్పంచ్)మరియు కన్నూరు యువసేన వారు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జరిగిన పూజలో రుద్రాభిషేకము,హోమం, సహస్ర లింగార్చన,తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమాలకు శ్రీమతి&శ్రీ కన్నూరు దేవి వెంకటమణ దంపతుల చేతులమీదగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటి అభ్యర్థి రొంగలి గోపాలకృష్ణ,కన్నూరి యువసేన మరియు తాణాం గ్రామం ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివుని భక్తి శ్రద్ధలతో కొలిచారు.

No comments:
Post a Comment