మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షెట్టిపెట్, పెన్ పవర్
పట్టణ కేంద్రంలోని ఉత్కూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజ మల్టీస్పెషాలిటి ఆసుపత్రిని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ పట్టణం నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు నుండి దిన దినం చాలా అబివృద్ది చెందడం గర్వాంగా ఉందన్నారు.గతంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ మంచిర్యాల,కరీంనగర్,హైదరాబాద్ ప్రాంతాలకు ప్రజలు వెళ్లి చూపించుకునేవారని దూర ప్రాంతాలకు వెళ్లడం అక్కడ ఎవరూ పరిచయిస్తులు లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధిక బిల్లులు చెల్లించి ప్రజలు ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయన్నారు.మండల ప్రజలకు అందుబాటులో దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని వసతులతో ఇక్కడ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా గర్వాంగా ఉందని పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకుని మంచి వైద్య సేవలు అందించాలని యజమాన్యులను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంత్తయ్య,వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,కౌన్సలర్ ఒరగంటి శ్రీకాంత్,రైతు బంద్ కన్వీనర్ నడిమెట్ల రాజన్న,మేనేజింగ్ డైరెక్టర్ అస్మాత్ అప్రిన్,ఆసుపత్రి డైరెక్టర్ మామిడి నర్సయ్య,భాస్కర్ రెడ్డి,భూమన్న,రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు


No comments:
Post a Comment