పైడిమెట్టలో కొప్పాక గ్రేస్ కుమారి అభివృద్ధి కార్యక్రమాలు
తాళ్ళపూడి, పెన్ పవర్పైడిమెట్ట గ్రామంలో నూతనంగా పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికైన కొప్పాక గ్రేస్ కుమారి స్థానిక యువకులను కూడగట్టి స్వచ్ఛ పైడిమెట్ట కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రాంతంలో గడ్డి చెత్త చెదారం పేరుకుపోవడం తో బుధవారం ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. గ్రామంలో మరిన్ని పారిశుధ్య కార్యక్రమాలను స్థానిక యువకులు, నాయకులతో కలిసి చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ కన్వీనర్ కొల్లి దుర్గారావు, గ్రామస్తులు కొప్పాక రాజు, సుబ్రహ్మణ్యం, జొన్నకూటి మనోహర్, చిట్టిబాబు, మధు, దేవరపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment