బైంసాలో అల్లర్లు సృష్టించిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి
హిందూవాహిని సభ్యుల డిమాండ్
లక్షెట్టిపెట్,పెన్ పవర్
పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో హిందువాహిని సభ్యులు బైంసాలో అల్లర్లను చెలరేపిన ఎంఐఎం నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు జాతీయ రహదారిపై బుదవారం రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా హిందువాహిని జిల్లా ఇంచార్జ్ ఆదర్భ్ భారతన్ మాట్లాడుతూ బైంసాలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మున్సిపల్ వైస్ చేర్మన్ జబీర్ అహ్మద్ అనే రౌడీ షీటర్ రోహంగ్యాలకు ఆశ్రమం కల్పించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరువులపై,హిందువుల వాహనాలపై,దుకాణాలపై ఎంఐఎం లను ప్రోత్సహిస్తు దాడులు జరిపిస్తున్నాడన్నారు.ప్రభుత్వం వెంటనే అల్లర్లు సృష్టించిన ఎంఐఎం నేతనలు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు రాస్తారోకో అనంతరం జాతీయ రహదారిపై ఎంఐఎం నేతల దిష్టిబొమ్మను దహనం చేసారు.హిందువాహిని సభ్యులు చేస్తున్న నిరసనకు బిజెపి నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దత్తు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందువాహిని సభ్యులు వంశీ,మదూకర్,చందు, తో పాటు బిజెపి నాయకులు వీరమల్ల హరిగోపాల్,వేముల మదు,కిషన్,సతీస్,చంద్రమౌళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment