నాచారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
తార్నాక, పెన్ పవర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా నాచారం 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు. అనంతరం దుర్గ నగర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్.ఆర్ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, వి.ఎస్ చరణ్ రెడ్డి, వి.ఎస్ జీవనప్రియ, ఉమ వసంత, పల్లవి, స్వర్ణ, లావణ్య, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment