Followers

సమసమాజ స్థాపనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి

 సమసమాజ స్థాపనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి -భారత రత్న అంబేద్కర్  జయంతి వేడుకలు.

రెబ్బెన, పెన్ పవర్

రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న  డాక్టర్ బీఅర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలను భీం యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు, నెహ్రూ యువ కేంద్రం, నేషనల్ యూత్ వాలంటీర్ సందీప్ పాల్గొని యువతకి అంబేద్కర్ గారి గొప్పతనం, ఆయన పేద, బలహీన వర్గాల కోసం చేసిన కృషిని తెలియజేశారు. కుల మత వివక్షలు లేని  సమసమాజ స్థాపనకై యువకులందరూ కృషి చేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ యూత్ అసోసియేషన్ సభ్యులు సాగర్, రాజేందర్, అజయ్. నారాయణపూర్ ఎంపీటీసీ దుర్గం రాము, సర్పంచ్ వేమునూరి అమృత, ఉప సర్పంచ్ రవి, వార్డ్ సభ్యుడు రాచకొండ రాజు, కొమురవెల్లి సర్పంచ్ తిరుమల్ మరియు గ్రామస్తులు దుర్గం రవి, శివ, మధు, రాజేందర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...