Followers

ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజా ఉద్యమం తప్పదు పాసర్ల ప్రసాద్

 ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజా ఉద్యమం తప్పదు పాసర్ల ప్రసాద్

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజా ఉద్యమం తప్పదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ హెచ్చరించారు.శుక్రవారం పాసర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం బృందం రామకృష్ణ బీచ్ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తున్న స్థలాన్ని పరిశీలించారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. రామకృష్ణ బీచ్ వద్ద సర్వే నంబరు 11 0 1. సుమారు 14 ఎకరములు భూమి ప్రభుత్వం వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రకటన విడుదల చేశారన్నారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వం సుమారు 18 ప్రభుత్వ స్థలాలు విక్రయానికి ఈ వేలం ద్వారా అమ్మ చూపుతున్నారని విమర్శించారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని ఆపాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రజల సహాయంతో ఉద్యమాన్ని చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు చాలా అన్యాయం చేసిందని,ఇప్పటి వరకు ఎక్కడా ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని విమర్శించారు.ప్రభుత్వ భూములను ఎలా అమ్మ చూపుతారని ప్రశ్నించారు.పరిపాలనా రాజధాని అని గొప్పగా ప్రకటించారని, రాజధానిగా విశాఖలో పాలనా ప్రారంభిస్తే ప్రభుత్వానికి భూములు ఎక్కడవని ఘాటుగాప్రశ్నించారు. నగర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సనపలపాండురంగారావు,టిడిపి నాయకులు గండి రవికుమార్,గడ్డం ప్రసాద్,తమరాన బంగారు నాయుడు,గొంప సత్యనారాయణ,పైలెట్ పూడి సత్యం,కృష్ణ చైతన్య తదితర నాయకులు పాశర్ల వెంట ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...