బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మదన్ లాల్కు సన్మానం
అందరి సహకారంతోనే నా నియామకం
నెల్లి కుదురు , పెన్ పవర్
బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గా ఎన్నికైన బీజేపీ యువ నాయకులు గుగులోతు మదన్ లాల్ ను మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కారు పోతుల చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయా ప్రాంతాలలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరారు. సన్మాన గ్రహీతబీజేపీ యువ మోర్చా రాష్ట్ర నూతన అధికార ప్రతినిధి మదన్లాల్ మాట్లాడుతూ.యువ మోర్చా రాష్ట్ర పదవిలో నియామక వెనుక ప్రతి కార్యకర్త నాయకుల సహకారం ఉందన్నారు. నూతన పదవితో తనకు మరింత బాధ్యత పెరిగిందని పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. బండి సంజయ్ నేతృత్వంలో బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంతకు మునుపు మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మునిగలవీడు ఎంపీటీసీ నల్లాని పాపారావు, పార్టీ నాయకులు టైరు పటేల్ రవి గౌడ్ ఎడ్ల మహేష్, యుగేందర్ తాళ్ల పెళ్లి వాసు గౌడ్. జిలకర యాకయ్య యాకీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment