డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి : పన్నాల
తార్నాక , పెన్ పవర్మల్లాపూర్ డివిజన్ లోని ఓల్డ్ మల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి బస్తి సమస్యలపై పర్యటించి స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్, నీటి, కరెంటు ఇతర సమస్యపై క్షున్నంగా, ఆణువణువూ తిరిగి సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఓల్డ్ విలేజ్ లో నీటి సమస్య పై స్థానికులు పిర్యాదు చేస్తే అప్పటికప్పుడు పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏ సమస్య ఉన్నా తెలియజేస్తే త్వరగతి న పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయము తో త్వరలో మరోసారి సందర్శించి సమస్యలపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తీగుల్ల శ్రీనివాస్ , వాసుదేవ్ గౌడ్ , కటార్ల భాస్కర్ , అల్తాఫ్ , అల్లాడి కృష్ణ , రాపోలు శ్రీనివాస్ , తోపు అశోక్ , కప్పరా సాయి , సాయి గౌడ్ , బాలరాజ్ గౌడ్ , ముజీబ్ , స్థానికులు , అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి పాల్గొన్నారు.

No comments:
Post a Comment