Followers

మాజీ ఎమ్మెల్యే కుంజ బోజ్జి మృతి

 మాజీ ఎమ్మెల్యే కుంజ బోజ్జి మృతి

వి.ఆర్.పురం, పెన్ పవర్

వి.ఆర్.పురం మండలం అడవి వెంకన్న గూడెం   గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకుం జ బోజ్జి  అనారోగ్యం కారణంగా భద్రాచలం ఒక ప్రైవేట్  వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినారు. మంగళవారం  ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ  నాయకులు తెలిపారు.మన్యం ముద్దు బిడ్డ , అలుపెరగని బాటసారి, సీపీఎం పార్టీ లో ఒక సామాన్య కార్యకర్త నుండి భద్రాచలం నియోజక వర్గం మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎదిగిన మహనీయుడు. ఒక్కసారి ఎమ్మెల్యే గా పనిచేస్తేనే చాలు తరతరాలు కూర్చోని బ్రతికేయవచ్చు అనే రోజుల్లో మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా సొంత ఇళ్లు కుడలేని నిస్వార్థ రాజకీయనాయకుడు. ఆయన గురించి మనం ఎంత మాట్లాడిన తక్కువే. సీపీఎం పార్టీకి ఆయన మృతి  తీరని లోటు అని  మండలంలోని సిపిఎం పార్టీ వర్గాలు  తెలిపాయి.  అడవివెంకన్న గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...