Followers

పంచారామంలో ఉగాది నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు...

 పంచారామంలో ఉగాది నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు... 

 సామర్లకోట, పెన్ పవర్    

 పంచారామా క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో ఈ నెల 13వ తేదీ ఉగాది రోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి చెప్పారు.  ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యేక పూజలతో ఈ ఉత్సవాలను ప్రారంబిస్తున్నట్టు చెప్పారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనము, ఋత్వికుల రక్షాబందనము, కలశస్థాపనతో ప్రారంభించి పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా అప్పటి నుంచి 22వ తేదీ వరకు ఆలయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, 8.30 గంటలకు మహన్యాసము, 9.30 గంటలక ఏకాదశ రుద్రాభిషేకాలు, నీరాజన మంత్రపుష్పములు, సాయంత్రం 4 గంటలకు బాలా త్రిపుర సుందరీ అమ్మవారికి నవవర్చానలు, , 5.30 గంటలకు కుకుమార్చనలు, 6.30 గంటలకు నీరాజన మంత్ర పుష్పములు, 7 గంటలకు దర్బారు సేవ, వేదన్వస్తి, మహదాశీర్వచన పూజలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ తొమ్మిది రోజుల పాటు గోత్ర నామాలతో పూజలు చేయించుకునే భక్తులు ఆలయంలో సంప్రదించి పర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించాలని ఈ సందర్భంగా ఆలయ అధికారి నారాయణమూర్తి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబులు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...