Followers

దిశ చట్టం పై అవగాహన సదస్సు

 దిశ చట్టం పై అవగాహన సదస్సు

సంతబొమ్మాళి, పెన్ పవర్

మహిళలకు రక్షణగా నిలిచే దిశ చట్టంపై ప్రతి విద్యార్థిని అవగాహన పెంచుకోవాలని శ్రీకాకుళం దిశ డిఎస్పి వాసుదేవ్ అన్నారు. నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  హై స్కూల్ విద్యార్థినిలకు , జూనియర్ కళాశాల విద్యార్థినులకు  సోమవారం దిశ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా దిశ డిఎస్పి వాసుదేవ్, దిశ ఎస్సై ప్రభావతి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసేందుకు దిశ చట్టం వేగంగా చర్యలు చేపడుతుందన్నారు. దిశ చట్టం సంబంధిత వ్యవస్థ అమల్లోకి వచ్చాక సమాజంలోని ఏ ఒక్క మహిళ భయ పడకూడదని,  అదే సమయంలో మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడే వారికి "దిశ"  పేరు వినగానే వణుకు పుట్టాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  లక్ష్యమని విద్యార్థినులకు వారు  తెలిపారు.


 సమాజంలో ప్రస్తుతం పరిణామాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలను విద్యార్థినిలకు వివరించారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి విద్యార్థిని దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు . అనంతరం యాప్ ని ఎలా ఉపయోగించాలో వివరించారు. స్త్రీలపై జరిగే లైంగిక దాడులు గురించి విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే పలు సెక్షన్లు పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మహమ్మద్  యాసిన్, ప్రధానోపాధ్యాయురాలు వై.వి వర్ధనం, గ్రామ సర్పంచ్ పిలక బృందావతి రవికుమార్ రెడ్డి , విద్యా కమిటీ చైర్మన్ అప్పలరాజు, మహిళా పోలీసులు, ఉపాధ్యాయ సిబ్బంది,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...