ఆడపడుచులకు అండ కెసిఆర్ ప్రభుత్వం...
జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్
బేలా, పెన్ పవర్దేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి పథకాలతో నిరుపేద మహిళలకు అండగా ఉంటూ కెసిఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేస్తూ ఆడపడుచులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రైతు మనోహర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి అర్హులైన 22 మంది కి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు నెరవేర్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ ప్రభుత్వాలు అమ్మలు పరచలేనటువంటి పథకాలు మన టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం ద్వారా పేద కుటుంబానికి ఒక పెద్ద అన్నల అండగా ఉంటుందన్నారు. టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ మస్కె తేజ రావు, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంబీర్, విట్టల్, ఎంపీడీఓ రవీందర్, డీటీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment