Followers

.శ్రీ శ్రీ శ్రీ దేవి దండుమారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

 .శ్రీ శ్రీ శ్రీ దేవి దండుమారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం పట్టణం కంటోన్మెంటులోగల శ్రీ దేవీ దండుమారమ్మ దేవాలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను, సోమవారం నాడు జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి ప్రారంభించారు. శ్రీ దేవి దండు మారమ్మ ఉత్సవాలు ఏప్రిల్ 13 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో దాతలు, ఆలయ కమిటీ సభ్యులు చొరవతో ఆధునీకరణ పనులను చేపట్టారు. ఈ ఆధునీకరణ పనుల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ముఖ్య అతిధిగా హాజరుకాగా, ఆలయ ప్రధాన అర్చకులు జిల్లా ఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ ప్రధాన గేటును,దాతల సహకారంతో నిర్మించిన గణేష్, సరస్వతి దేవి సహిత అష్ట లక్ష్మీ విగ్రహాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. దాతలు గుర్జాల వెంకట రమణ, బండారు సాగర్, శంభాన నాగరాజు, సింగపురం రవీశ్వరుడు, పుప్పాల కోటేశ్వరరావు, ఆర్లె కృష్ణారావు, అట్ల శ్రీధర్, రొంగలి అప్పలనాయుడు, తాడి నర్సింగరావు, రొంగలి జీవన్ కుమార్ సహకారంతో నిర్మించిన గణేష్, సరస్వతి సహిత అష్ట లక్కుల విగ్రహాలను, ఆలయ ప్రధాన ద్వారంకు వెండి తాపడం పనులను, అంతరాలయం చుట్టూ ఇనుప గిల్స్ స్థానంలో స్టీలు గ్రిల్సును జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు మరియు ఇతర పోలీసు అధికారులు ప్రారంభించారు. అనంతరం, జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు మరియు ఇతర పోలీసు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - శ్రీ దేవీ దండుమారమ్మ ఆలయాన్ని అభివృద్ధిపర్చుటలో భాగంగా దాతల సహకారంతో తొమ్మిది రకాల అభివృద్ధి రకాల కార్యక్రమాలను చేపట్టి, వాటిని ప్రారంభించుట జరిగిందన్నారు. ఇందులో భాగంగా దాతల సహకారంతో నిర్మించిన 10 విగ్రహాలను, ప్రధాన గేటు, ప్రధాన ద్వారంకు వెండి తాపడం, తులసి కోట, అంతరాలయం చుట్టూ ఇంత వరకుగల ఇనుప గేటుల స్థానంలో స్టీలు గేటులను, ప్రధాన అలయంకు స్టీలు గేటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయంలో చాలా వరకు పనులను ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల శ్రమదానంతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ నెల 13 నుండి 20 వరకు శ్రీ దేవీ దండుమారమ్మ ఉత్సవాలను చేపడుతున్నామన్నారు. ఉత్సవాల ప్రారంభ వేడుకల్లో విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని, ప్రత్యేక పూజలు చేపడతారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఉత్సవాల నిర్వహణ చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. విగ్రహ దాతలు, ఆలయ అభివృద్ధికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎస్బీ సిఐ జి. రాంబాబు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, ఆఱలు ఎస్. చిరంజీవి, టివిఆర్ కే కుమార్, పి.మెరియన్ రాజు, రమణమూర్తి, ఆర్ఎస్ ఐలు, ఎస్ఐలు, పోలీసు అసోసియేషను అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు రొంగలి అప్పలనాయుడు, జగ్గారావు, అప్పన్న, హరినారాయణ, వెంకటరమణ, శ్రీనివాసరావు,వెంకటేశ్వరరావు, రాంబాబు, నాగరాజు,రమేష్, మోహనరావు, పాశల శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...