Followers

రైతు భరోసా కేంద్రంలో రబీ సీజన్ కు అవసరమైన శిక్షణ

 రైతు భరోసా కేంద్రంలో రబీ సీజన్ కు అవసరమైన శిక్షణ



తాళ్ళపూడి, పెన్ పవర్,  

వైయస్సార్ ఉచిత పంటల భీమా పథకంలో భాగంగా వరి మరియు మొక్కజొన్న పంటలు తాళ్ళపూడి మండలంలో సెలెక్ట్ అయ్యాయి. దానిలో భాగంగా శిక్షణా కార్యక్రమం 

మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఎఓ జి.రుచిత అధ్యక్షతన శనివారం జరిగింది. ఎయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ సహాయకులు, ఉద్యానవన సహాయకులకు రబీ సీజన్ విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన శిక్షణ అందించారు. వరి మరియు మొక్కజొన్న యూనిట్ నంబర్లు, రాండమ్ నంబర్లు వారికి అందించి, వారు ఫారాలు ఎలా పూర్తిచేయాలని కూలంకషంగా వివరించడం జరిగింది. ఏ ఇబ్బందులు ఉన్న వ్యవసాయ అధికారిని దృష్టికి తీసుకురావాలని, ఏ పంట నష్ట పోకూడదని, ప్రయోగాలు పారదర్శకంగా ఉండాలని, భాద్యతగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చారు. ఎఒ జి.రుచిత మాట్లాడుతూ ఈ వారంలోపే ఫారం 1 లను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎఎలు, విహెచ్ఎలు, తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వానికి అపూర్వ స్పందన:ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

 సభ్యత్వానికి అపూర్వ స్పందన:ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..



కుత్బుల్లాపూర్, పెన్ పవర్‌

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని దోబీఘాట్ వద్ద స్థానిక డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని సభ్యత్వ రశీదులు కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.



 అనంతరం దోబీఘాట్ లో పూర్తి చేసిన 300 సభ్యత్వాలు, రుసుమును డివిజన్ అధ్యక్షులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ నగర్ వాషర్ మ్యాన్ సొసైటీ అధ్యక్షులు వెంకటయ్య, మహేందర్, యాదగిరి, రమేష్, సాంబయ్య, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, నర్సింహా, గౌరయ్య, చంద్రమౌళి, పర్షురాములు, రామ్ చందర్, ఆంజనేయులు, వెంకన్న, లక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



పల్లా గెలుపుకోసం విస్తృత ప్రచారం చేసిన టిఆర్ఎస్..

 పల్లా గెలుపుకోసం విస్తృత ప్రచారం చేసిన టిఆర్ఎస్.. 



 బయ్యారం, పెన్ పవర్


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరారం ఉమ్మడి గ్రామపంచాయతీ. వినోబా నగర్. గురి మల్ల. కోడిపుంజుల తండా. గ్రామాలలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.. 100 మంది పట్టబద్రులను కలిసి మొదటి ప్రాధాన్యతగా పల్లారాజేశ్వరరెడ్డికి ఓటు వేయాలని కోరారు.. 




ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తాతాగణేష్. టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రెంటాల బుచ్చిరెడ్డి. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ. ఎమపిటిసి వజ్జ భద్రయ్య. సర్పంచి తాటి వెంకన్న. గ్రామ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. ఆవుల లింగయ్య. భూక్య రవి. మండల నాయకులు. దేవన బోయిన శ్రీను. నక్క వెంకన్న. యడమ మల్లేష్. గ్రామ శాఖ ఉపాధ్యక్షులు భూక్య చిట్టి. గ్రాడ్యుయేట్స్. దేవయ్య. సింగర బోయిన రమేష్. గంగుల హరి ప్రసాద్. బిజ్జా రమాదేవి. నూనె యాకయ్య. గుడి శాలఅశోక్. బోల్లనరేందర్. వర్రే యకుఫశా. నరేష్. పోగుల కృష్ణ స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

చాదర్ ను అజ్మీర్ దర్గాకు సంప్రదాయబద్ధంగా సాగనంపిన ఎమ్మెల్యే

 చాదర్ ను అజ్మీర్ దర్గాకు సంప్రదాయబద్ధంగా సాగనంపిన ఎమ్మెల్యే...

కుత్బుల్లాపూర్, పెన్ పవర్

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సంప్రదాయబద్ధంగా సాగనంపారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్ లో ముస్లిం సోదరుడు డాక్టర్ హుస్సేన్ ఆధ్వర్యంలో దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ఎమ్మెల్యే ముందు ప్రదర్శించారు. 




ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ ముదిరాజ్, మన్నన్, యూసుఫ్, అలీమ్, సర్వర్, ఆసిఫ్, దస్తగిర్, ఆసిం తదితరులు పాల్గొన్నారు.

టిడిపి కి" తుర్పే" దిక్కు

 టిడిపి కి" తుర్పే" దిక్కు

పసుపు మయంగా మారిన 11వ వార్డు








తూర్పు 11వ వార్డు టిడిపి ప్రచారంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. టిడిపి అభ్యర్థినిరాగతి అప్పలకొండ. రాగతి అచ్యుతరావు.

ఆరిలోవ. పెన్ పవర్


తూర్పు నియోజకవర్గం 11వ వార్డులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ రాకతో వార్డులో నూతన ఉత్సాహం నెలకొంది. తూర్పు నియోజకవర్గం అంటే నే టి.డి.పి కంచు కోట పదకొండవ వార్డుటిడిపి అభ్యర్థిని రాగతి అప్పలకొండ. రాగతి అచ్యుతరావు గత జివిఎంసి ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన అభ్యర్థి కారణంతో ఈ వార్డులో తనకంటూ పట్టు ఉంది. రాగతి అప్పల కొండ కు ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వార్డులో సమస్యల పై పూర్తి అవగాహన ఉండడం, గత ఎన్నికల అనుభవం రాగతి అప్పలకొండ గెలుపు పార్టీ సీరియస్ గా తీసుకుంది దానిలో భాగంగానే గాంధీ నగర్ గణేష్ నగర్ రవీంద్ర నగర్ పలు ప్రాంతాల్లో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు వెంటరాగా టీడీపీ తన ప్రచారాన్ని కొనసాగించింది.

గడప గడపకు పాదయాత్ర

అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని 38 వార్డ్ కాంగ్రెస్  కార్పొరేటర్ అభ్యర్థిని  కుమారి తహసీన్ భాను,  గడప గడపకు పాదయాత్ర,  అడుగడుగునా జన నీరాజనాలు




 విశాఖ తూర్పు , పెన్ పవర్  

 



 నన్ను గెలిపించండి  అభివృద్ధి చేసి చూపిస్తా అనే నినాదం తో గడపగడపకు వెళ్లి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని దారిపొడవునా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఉదయం 7 గంటల నుండి బుక్కవీధి,కంచర వీధి   గడప గడప  వెళ్ళి ప్రచార కార్యక్రమము  చేపట్టడం జరిగింది    వార్డు లో మీ తోనే ఉంటూ మీ సమస్య నా దంటూ ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు   మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలుగచేయాలని వార్డ్ లో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జివిఎంసి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు  బూత్ ప్రెసిడెంట్  , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు   ,    వీరవల్లి శ్రీనివాస్, మహేష్, షణ్ముక్, శివ, సుభాని, వాజీద్, అజారుద్దీన్, సయ్యద్ ముస్తఫా యాసిన్, పాల్గొనటం జరిగింది

మానవత్వం చాటుకున్న మంత్రి

 మానవత్వం చాటుకున్న మంత్రి









పెన్ పవర్, కొవ్వూరు. 


  రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి, శ్రీమతి డాక్టర్ తానేటి వనిత అంతర్వేది నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తిరుగు ప్రయాణంలో స్థానిక అంతర్వేదిపాలెం నందు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్న ఒక వ్యక్తిని చూసిన మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి  తానేటి వనిత  ఆదేశాలమేరకు  మంత్రి సిబ్బంది అందరూ వెంటనే యాక్సిడెంట్ కి గురైన వ్యక్తిని హాస్పిటల్ కి పంపించడం జరిగింది.




సమయానికి హాస్పిటల్ కి  పంపించే ఏర్పాటు చేసి , వైద్యం అందేల తగు చర్యలు తీసుకునేందుకు మంత్రికి, మంత్రి సిబ్బందికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...