Followers

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూన శ్రీశైలం గౌడ్ 


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. కూన శ్రీశైలం గౌడ్.


కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నాను

గత మూడు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను

2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిపొందాను

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా,మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేసాను.

కుత్బుల్లాపూర్, పెన్ పవర్

గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైంది. ఇవన్నీ చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను,హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని ఒక నిర్ణయానికి వచ్చారు, దీనికి ఉదాహరణ దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైంది. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగే కారణం,  పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనని,ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చానని, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా టీఅర్ఎస్పై అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీనే అని నిర్ణయానికి వచ్చానని అన్నారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు..



2009 కొత్తగా పునర్విభజనలో ఏర్పడ్డ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మొట్టమొదటి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చరిత్ర సృష్టించాడు... నాడు కాంగ్రెస్ ..బిజెపి ..వేరువేరుగా .టిఆర్ఎస్ పొత్తు ద్వారా పోటీ చేసినప్పటికీ ప్రజలు మాత్రం వైయస్సార్ అనుంగశిష్యుడుగా ఉన్న కూనశ్రీశైలంగౌడ్ను  గెలిపించారు. 2009లో ఇండిపెండెంట్గా గెలిచి నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్ అనుబంధ సంఘ సభ్యునిగా కొనసాగారు. వైయస్సార్ కు నమ్మినబంటుగా ఉంటూ పాదయాత్ర చేస్తున్న క్రమంలో మొత్తం అన్ని తానై చూసుకున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీసీ నాయకునిగా గుర్తింపు పొందిన కూన శ్రీశైలం గౌడ్ ప్రజాబలం ఉన్న నాయకుడు. దీంతో బీజేపీ శ్రేణులు అతనిపై గత సంవత్సర కాలంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆది నాయకుల నుండి ఒత్తిడి తెచ్చారు. పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన ఇంతవరకు కొత్త వ్యక్తిని నియమించకపోగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మూలంగా ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు తెలిసింది.

అధికారుల తప్పిదాలకు..మేకకు శిక్షా..?

 అధికారుల తప్పిదాలకు..మేకకు శిక్షా..?

హరితహారం మొక్కలను తిన్న మేకలకు జరిమానా..

మొక్కలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయనందుకు అధికారులకు ఏ శిక్ష వేయాలో..?



మొక్కలకు ట్రీగార్డులు ఉన్నాయా..ఉంటె మేకలు తినే అవకాశం ఉంటుందా..

అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే జరిమానాలు..? 

మూగజీవాల పట్ల ఏవిధంగా వ్వవహరిస్తున్నారో ఈ అధికారులను చూసి నేర్చుకోవాలా..?

ఉన్నతాధికారుల మెప్పు పొందటానికే ఈ చర్యలా..?

కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటె ఇదేనేమో..




కుత్బుల్లాపూర్, పెన్ పవర్

దుండిగల్ మున్సిపల్ అధికారుల వ్యవహారశైలి ఈ మధ్య చిత్ర విచిత్రంగా తయారౌతుంది. హారితహారం మొక్కలను తిన్నందుకు మేకలకు 100/- రూపాయల జరిమానా విధించారు.. మరి వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేయనందుకు అధికారులకు ఎలాంటి   శిక్ష వేయాలో అని పలువురు జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.. నిర్వహాణ సరిగ్గాలేక ఎండిపోయిన మొక్కలు దుండిగల్ మునిసిపాలిటీ లో కోకొల్లలు.. అవకాశం దొరికింది కదా అని.. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే  మేకలు తిన్నాయని చెప్పుకోవడానికి రికార్డు కోసం ఇదంతా చేస్తున్నారని జంతుప్రేమికులు ఆరోపిస్తున్నారు.. 



వివరాల్లోకి వెళితే శనివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మర పోచంపల్లి సాయిపూజ కాలనీకి చెందిన నవాజ్ కు సంభందించిన  మేకలు మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై అక్కడక్కడ హరితహారంలో నాటిన మొక్కలను తిన్నాయని మున్సిపాలిటీ సిబ్బందికి కోపం వచ్చింది. ఇక అంతే మొక్క తిన్న మేకకు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ చేసి మరీ జరిమానా విధించారు.. మరి మిగతా మొక్కలకు కనీసం ట్రీ గార్డులు కూడా వేయకుండా  గాలికి వదిలేశారు. మొక్కలకు ఎలాంటి ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదు..అలాంటి మొక్కలు కనిపించగానే మూగజీవాలైన మేకలు తిన్నాయని యజమాని "నవాజ్" కు 100 రూపాయలు జరిమానా విధించారు.. 


టెక్నాలజీతో పోటీపడుతూ ముందుకెళ్తున్న మానవులే మతిస్థిమితం లేక వ్యవహరిస్తుంటారు.. అలాంటిది నోరులేని మూగజీవివులకు జరిమానాలు విధించి దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు తమ సత్తాను చాటుకుంటున్నారు.. అక్రమనిర్మాణాలపై ఎన్ని సార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా దున్నపోతుపై వర్షంపడ్డ చందంగా స్పందించని మున్సిపల్ అధికారులు.. ఇలాంటి  విషయాలలో మాత్రం చాలా తొందరగానే చర్యలు తీసుకోవడం కొసమెరుపు...

శాసన మండలి ఎన్నికలలో ప్రశ్నించే గొంతులను గెలిపించండి

 శాసన మండలి ఎన్నికలలో  ప్రశ్నించే గొంతులను గెలిపించండి 



తార్నాక, పెన్ పవర్ :


తెలంగాణ  రాష్ట్రంలో జరుగుతున్న శాసన మండలి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలను గెలిపించుకొని శాసన  మండలికి పంపుదామని  పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, బోయిన్ పల్లి రాము పిలుపునిచ్చారు. శనివారం జరిగిన 

పి డి ఎస్ యూ రాష్ట్ర కమిటీ సమావేశం లో ప్రో నాగేశ్వర్ , ప్రో కోదండరాం లకు  మద్దతు తెలియచేస్తూ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సంద్భంగా  ఉస్మానియా యూనిర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం లో జరిగిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా 

వారు మాట్లాడుతు ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకుని కొట్లాడి తెలంగాణ సాధించడంలో లో ముందుండి  అనేక కేసులు నిర్బంధాలు ఎదుర్కొని ప్రజల తరఫున నిలబడ్డారని అన్నారు . ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్సీ గా చేసి తెలంగాణ రాష్ట్రంలోని దేశంలోని అనేక సమస్యలపై స్పందిస్తూ విద్యార్థులు నిరుద్యోగులు ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాలను నిలదీసిన చరిత్ర  ఆయనకు ఉందని, వీరు ఇద్దరు కాకుండా  ప్రస్తుతం శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే వారి చరిత్రలు చూస్తే వారు ఎక్కడ కూడా ప్రజల తరఫున విద్యార్థులు, నిరుద్యోగులు ప్రజల తరఫున మాట్లాడిన చరిత్ర లేదు,  వీరు కాకుండా ఎవరు గెలిచినా ప్రభుత్వాలకు అమ్ముడుపోయి లేదా ప్రశ్నించకుండా సమస్య ల పట్ల మెతక వైఖరి అవలంబించే అవకాశం ఉన్నదన్నారు. కావున వీరిని గెలిపించుకొని శాసన మండలికి పంపాల్సిన అవసరం ఉందని,  ప్రతి ఒక్క నిరుద్యోగి పట్టభద్రులు తప్పకుండా వీరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి  శాసనమండలికి పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 

పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.నాగేశ్వర్ రావు, సాగర్, శరత్, గణేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మహేష్,సంధ్య, రాష్ట్ర కమిటీ నాయకులు స్వాతి, విష్ణు, సాయి, శ్రీకాంత్, గౌతం, శ్రీకాంత్, హలీమ్ పాష, వెంకటేష్, ఆజాద్, అశోక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనిల్, పీడీఎస్యూ  ఓ యూ ప్రెసిడెంట్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

రూ 2లక్షల 50 వేల అక్రమ మద్యం బాటిళ్ల పట్టివేత

 రూ 2లక్షల 50 వేల అక్రమ మద్యం బాటిళ్ల పట్టివేత



 నాయుడుపేట, పెన్ పవర్

నాయుడుపేట పట్టణ సమీపంలో జువ్వల పాళెం రోడ్ వద్ద శనివారం ఎస్ ఈ బి అధికారులు  ఆకస్మిక దాడులు నిర్వహించి రూ 2 లక్షల 50 వేల రూపాయల విలువ గల 1650 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట ఎక్షైజ్ కార్యాలయంలో ఎస్ ఈ బి  అధికారులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ ఈ బి ,డీ ఎస్ పి లు బి.వెంకటేశ్వర్లు,ఈ. శ్రీనివాసరావు మాట్లాడారు. గోవా నుండి ఒంగోలు జిల్లా చీరాలకు అక్రమంగా చేపల లోడు వ్యాన్ లో మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు త సిబ్బంది చేపల లోడు మాటున అక్రమ మద్యం తలిస్తున్న వ్యాన్ ను నాయుడుపేట  పట్టణ సమీపంలో స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. 



వ్యాన్ లో ఉన్న 1650 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం తోపాటు మద్యాన్ని తరలిస్తున్న డ్రైవర్ షేక్ కామిల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ ఈ బి,సి ఐ షేక్. అబ్ధుల్ జలీల్,ఎస్ ఐ శేషమ్మ వున్నారు.అప్రమత్తంగా వ్యవరిస్తూ అక్రమ గుట్కా,మద్యం ను పట్టుకుంటున్న నాయుడుపేట ఎస్ ఈ బి,సి ఐ అబ్దుల్ జలీల్, ఎస్ ఐ శేషమ్మలను ఎక్షైజ్ డి ఎస్ పి లు అభినందించారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

 ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్




కూకట్ పల్లి, పెన్ పవర్

బౌన్స్ సంస్థకు చెందిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి అమ్ముకుందామనుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కూకట్ పల్లి పోలీసులు. శనివారం కూకట్ పల్లి ఏసిపి కార్యాలయంలో ఏసిపి సురేందర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా శంకరపల్లి మైతాబ్ ఖాన్ గూడకు చెందిన అవసలి నరేష్(28) మెకానిక్ గా పని చేస్తున్నాడు.

బౌన్స్ అనే ద్విచక్ర వాహనాలు అద్దెకు ఇచ్చే సంస్థకు చెందిన ఐదు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి ఊరిలో ఉన్న మెకానిక్ షాపుకు తీసుకెళ్లి వాటికి ఉన్న రంగులను మార్చి  అమ్మకానికి సిద్ధం చేస్తుండగా నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో రెండు సంవత్సరాలు బౌన్స్ సంస్థలో టెక్నీషియన్ గా పని చేసిన నరేష్ గత రెండు నెలలుగా వినియోగదారులు వాడుతున్న వాహనాల జిపిఎస్ వైర్లను కత్తిరించి తన ఊరిలో ఉన్న మెకానిక్ షాపుకు  తీసుకెళ్లి మూడు ద్విచక్ర వాహనాలకు రంగులు మార్చి అమ్మే క్రమంలో కూకట్ పల్లి పోలీసులు శుక్రవారం సాయంత్రం నిందితుడుని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు తెలిపారు. 

దొంగను అదుపులోకి తీసుకునే క్రమంలో చాక చక్యంగా వ్యవహ రించిన సిబ్బందిని ఏసిపి అభినందించారు. ఈ సమావేశంలో కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

 విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి. : జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి



 భీంపూర్ (ఆదిలాబాద్)/ పెన్ పవర్

 విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించి నాణ్యమైన బోధన అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం తాంసి, భీంపూర్ మండలల  విద్యాశాఖ అధికారి కోలా నర్సింలు తో కలిసి భీంపూర్ మండల కేంద్రంతో పాటు పీప్పల్ కోటి, అర్లి, కరంజి ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యాబోధన తీరును పదవ తరగతి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను చదివించారు, విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు అని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందనిప్రధాన ఉపాధ్యాయులు డిఈవో కు తెలియజేశారు.అందుబాటులో ఉన్న ఉపాధ్యాయునిగా గుర్తించి వెంటనే సర్దుబాటు చేయాలని మండల విద్యాశాఖ అధికారి కి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ ఎం సి. నగేష్,  ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రవి ప్రసాద్, ఏలియా తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 14 నుంచి బ్లూ సెట్ ఉద్యమానికి సిద్ధం కావాలి...

 ఏప్రిల్ 14 నుంచి బ్లూ సెట్ ఉద్యమానికి సిద్ధం కావాలి...



 * మాదిగ జేఏసి వ్యవస్థాపకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి,

 * ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు


 ఆదిలాబాద్,పెన్ పవర్

 ఎస్సీ  మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కై ఏప్రిల్ 14 నుంచి చేపట్టే బ్లూ షర్టు ఉద్యమానికి కార్యకర్తలు సిద్ధం కావాలని మాదిగ జేఏసి వ్యవస్థాపకుడు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. మాదిగ జేఏసి తరపున మాదిగల చైతన్య యాత్రలో భాగంగా శనివారం జిల్లా కేంద్రనికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా మాదిగ జేఏసి నాయకులతో కలిసి మాట్లాడుతు, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ ల వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం రెండుసార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వర్గీకరణపై ఊసే లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకూ మాదిగల మంత ఏకమై ఉద్యమిస్తామని అన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఏప్రిల్ 14 నుంచి నీలి చొక్కా ఉద్యమం చేపట్టడం జరుగుతుందని, ఈ ఉద్యమానికి ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీ లు పాల్గొనాలని అన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లపై అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో నీలి రంగుకు, కాషాయం రంగుకు పోటీ ఉంటుందన్నారు. కాషాయం రంగు తో అంబేద్కర్ వాదులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి దీరన్,మాదిగ జేఏసీ నాయకులు మైన ఉపేందర్,గడ్డ యాదయ్య,నక్క రాందాస్, మల్యాల మనోజ్, సురేష్, ప్రసన్న,మారంపల్లి శంకర్,అశోక్, విలాస్,సాంబశివ్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...