Followers

డ్యాన్స్ షో కోసం ఏకంగా అనకొండను పెంచుకున్నాడు..

డ్యాన్స్ షో కోసం ఏకంగా అనకొండను పెంచుకున్నాడు..

 ఇక్కడే పాలకొల్లు కుర్రాడి ప్లాన్ బెడిసి కొట్టింది..

పాలకొల్లు,పెన్ పవర్

స్నేక్‌డ్యాన్స్‌తో షేక్‌ చేయడానికి తీసుకొచ్చాడు అనకొండని. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లక్ష్మినగర్‌లోని ఓ ఇంట్లో ఈ భారీ కొండచిలువని చూసిన స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. దీంతో బాత్రూంలో నక్కిన పైథాన్‌ ఇలా బయటికొచ్చింది.అవీ ఇవీ పెంచుకుంటే కిక్కేముంటుంది. నా రూటే సెపరేటంటూ ఏకంగా పామును పెంచుతున్నాడో కుర్రోడు. చిన్నబుట్టలో పట్టే పాము కాదు…బస్తాలో పట్టనంత కొండచిలువని చూశారుగా ఎంతుందో. 11 అడుగులు. ఆదమరిస్తే మేకల్నీ, గొర్రెల్నీ కూడా మింగేసేంత సైజు. ఇదేం పోయే కాలంరా నాయనా అంటే…ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి ముచ్చటపడి తెచ్చుకున్నానని చెబుతున్నాడు.  కారుమంచి గంగాచలం అనే వ్యక్తి ఇంట్లోంచి 11 అడుగుల కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు అటవీఅధికారులు. స్నేక్‌డ్యాన్స్‌కోసం ఆ కొండచిలువను తీసుకొచ్చి బాత్రూంలో దాచాడు పెరవలికి చెందిన అతని మిత్రుడు భగవాన్‌. 8నెలల వయసున్న ఈ కొండ చిలువ బరువు 45 కిలోలుంది. ఇళ్లమధ్యలో కొండచిలువను తీసుకొచ్చి ఉంచిన విషయం తెలియటంతో దాన్ని చూసేందుకు జనం వచ్చారు. మొత్తానికి అధికారులు అనకొండని పట్టుకుపోవటంతో…అంతా ఊపిరిపీల్చుకున్నారు.

 వన్యప్రాణి సంరక్షణ చట్టం..

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణుల వేట నిషేధం. ఈ చట్టం వచ్చాక దేశవ్యాప్తంగా 23 టైగర్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 441 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలున్నాయి.  అన్ని రకాల వన్య ప్రాణులను రక్షించుకోవటమే వన్యప్రాణి సంరక్షణ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. ఇదిలావుంటే.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇది పెద్ద నేరమని.. చట్టంలో షెడ్యూల్‌ 1, 2 కింద అనకొండ వస్తుందని అటవీశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.1973 మార్చి 1వ తేదిన వైల్డ్‌లైఫ్‌ యాక్ట్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. అడవిలో వన్యప్రాణులను వేటాడినట్లు నిర్ధారణ అయితే శిక్ష 3 నుంచి 7 సంవత్సరాలతో పాటు రూ.27 వేలు జరిమానా ఉంటుంది. షెడ్యూల్‌-1: షెడ్యూల్‌-1 కింద పెద్ద పులి, నెమలి, చిరుత కృష్ణజింక, ఎనుగు, క్రూర మృగాలు వస్తాయి. షెడ్యూల్‌-2 కింద కొండ గొర్రె, దుప్పి, ఎలుగుబంటి, నక్కలుపాములు, అడవి కోడి, రేసు కుక్కలు వస్తాయి.షెడ్యూల్‌-3 కింద కుందేళ్లు, ఉడతలు, పావురాళ్లు వస్తాయి. షెడ్యూల్‌-4 కింద కొండముచ్చు కోతులు తదితరవి వస్తాయి. చూడ్డానికి ఈ చట్టం ఘనంగా ఉన్నా అరెస్టయిన వెంటనే ఈ కేసుకు బెయిల్‌ మంజూరు చేస్తుండడంతో నేరగాళ్లకు భయం లేకుండా పోయింది.

జీవ వైవిధ్య చట్టం

భారత ప్రభుత్వం జీవ వైవిధ్య చట్టాన్ని 2002లో అ మలు చేసింది. 2003 ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటించింది. భారత దేశానికి వర్తింప చేస్తూ జీవ వనరులపై సార్వభౌమాధికారం హక్కులను పునరుద్ఘాటించింది. భారత ప్ర భుత్వం 62వ భాగం కింద 2004లో జీవ వైవిధ్య నియమావళిని జారీ చేసింది. 2009లో భారత ప్రభుత్వం 63వ నియమం కింద ఆంధ్రప్రదేశ్‌ జీవ వైవిధ్య నియమావళిని రూపొందించింది. 22వ నియామం జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను విస్తరింప చేసి ప్రకృతి సంరక్షణే జీవ వైవిధ్యం.

జంతువులను వేటాడితే..

షెడ్యూల్‌-1 కింద ఉన్న జంతువులను వేటాడితే 1972 సెక్షన్‌ 9 కింద కేసు నమోదు చేస్తారు. అడవిలో అనుమతి లేకుండా ప్రవేశించిన ఐదు రకాల కేసులు నమోదు చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్‌ 27 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఆయుధాలతో అడవిలోకి వెళితే వారిపై సెక్షన్‌ 32 ప్రకారం శిక్ష అమలు చేస్తారు. 2002లో జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం కింద అ రుదైన సంరక్షణ సంచరించే ప్రాంతాల్లో అనుమతి లేకుం డా వెళితే శిక్షలు విధిస్తారు. 2006లో సెక్షన్‌- 51 సీ ప్రకా రం అడవిలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల లోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 నుంచి 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతేగానీ నేరస్తులను కొంతకాలం జైళ్లలో ఉంచేందుకు ఈ చట్టాలు పనికి రాకపోవడంతో అటవీశాఖాధికారులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.

ఆల‌యాల‌పై దాడుల‌కు పరాకాష్ఠ రామ‌తీర్థం ఘ‌ట‌న‌: తిరుమ‌ల‌లో చిన‌జీయ‌ర్ స్వామి

ఆల‌యాల‌పై దాడుల‌కు పరాకాష్ఠ రామ‌తీర్థం ఘ‌ట‌న‌: తిరుమ‌ల‌లో చిన‌జీయ‌ర్ స్వామి

ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల కేంద్రాలు

దేవాల‌యాల‌పై ఆధార‌ప‌డే అన్ని క‌ళ‌లు జీవిస్తున్నాయి

ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచ‌న‌లు చేస్తాం

తిరుమల, పెన్ పవర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులపై త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆల‌యాల‌పై దాడుల‌కు ప‌రాకాష్ఠ రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హ ధ్వంసం అని చెప్పారు. ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న  అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల కేంద్రాల‌ని చెప్పారు. దేవాల‌యాల‌పై ఆధార‌ప‌డే అన్ని క‌ళ‌లు జీవిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. కాగా, క‌రోనా నుంచి విముక్తి క‌ల‌గాలని తాను శ్రీవారిని ప్రార్థించాన‌ని చెప్పారు. కాగా, తిరుప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిన్న చిన‌జీయ‌ర్ స్వామి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి తాము నివేదిక అందించనున్నామని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

బాలాకోట్​పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు

 బాలాకోట్​ పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు

 పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై దాడి

వందలాది మంది ఉగ్రవాదుల హతం..

బలగాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నరాజ్ నాథ్

ఉగ్రవాదంపై భారత్ దృక్పథానికి నిదర్శనమన్న అమిత్ షా

 న్యూస్ డెస్క్, పెన్ పవర్

అందరూ హాయిగా నిద్రపోతున్న టైం అది. నిశీధి పరిచేసిన గగన వీధుల్లో ఝమ్మంటూ దూసుకెళ్తున్న యుద్ధ విమానాల నుంచి జారిన జ్వాలా క్షిపణులు.. క్షణాల్లో ఉగ్ర స్థావరాలను అగ్ని కీలల్లో ముంచెత్తాయి. వందలాది మంది ఉగ్రమూకలను ఆహుతి చేశాయి.2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులను బలిగొన్న ఉగ్రదాడులకు ప్రతీకారంగా.. వారం రోజులు తిరగకముందే ఫిబ్రవరి 26న పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులివి. గుండెల్లో నివురుగప్పిన ఆ ప్రతీకారాన్ని తీర్చుకుని నేటికి రెండేళ్లు.ఈ సందర్భంగా వైమానిక దళ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా బాలాకోట్ దాడులను గుర్తు చేసుకున్నారు. ‘‘బాలాకోట్ పై వైమానిక దాడులకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నా. ఉగ్రవాదంపై తమ పోరాటం సాగుతుందని చెప్పడానికి ఈ దాడులే నిదర్శనం. దేశాన్ని ఎల్లప్పుడూ భద్రంగా, సురక్షితంగా ఉంచుతున్న సాయుధ బలగాలు మాకు గర్వకారణం’’ అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.బాలాకోట్ పై దాడులతో ఉగ్రవాదంపై భారత్ దృక్పథం ఏంటో మరోసారి రుజువు చేసిందని అమిత్ షా అన్నారు. ‘‘పుల్వామాలో అమరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. బాలాకోట్ దాడుల సందర్భంగా వైమానిక దళాలు చూపించిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ, సైనికుల భద్రతే మాకు ప్రధానం’’ అని ట్వీట్ చేశారు.
కాగా, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ తర్వాత జరిగిన ఘర్షణల్లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఎఫ్16 విమానాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పాక్ భూభాగంలో ఆయన విమానం కూలిపోయింది. అక్కడి వారికీ అభినందన్ బందీగా చిక్కాడు. పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకుని, కొన్ని రోజులు విచారించిన తర్వాత, అంతర్జాతీయ ఒత్తిడి మేరకు తిరిగి భారత్ కు అప్పగించారు.

కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల మాఫియాను అరికట్టాలి ఎస్ ఎఫ్ ఐ

 కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల మాఫియాను అరికట్టాలి ఎస్ ఎఫ్ ఐ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ..

 



కుత్బుల్లాపూర్/పెన్ పవర్;

 కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా అరికట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ లో భాగంగా శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్పొరేట్ విద్యాసంస్థల దగ్గర  విద్యార్థులు ,విద్యార్థుల తల్లదండ్రుల తో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రకాంత్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి పరమేశ్వరి పాల్గొని మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా విపరీతంగా పెరిగిపోయిందని ఈ ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని, ఫీజుల విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తోందని అన్నారు, కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల విషయమై ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పూర్తిస్థాయిలో కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని విద్యార్థులను ప్రజలను రైతులను పట్టించుకోవడం పూర్తిగా విఫలమైందని అన్నారు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఉపయోగపడే విధంగా జీవోలు విడుదల చేసి పూర్తిస్థాయిలో కార్పొరేట్ వ్యవస్థకు లాభంచేకూర్చేవిధంగా ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. కరోనా కారణంగా సంవత్సరం నుంచి పాఠశాలల్లో మూతబడితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది, ఫీజులు చెల్లించకుంటే అడ్మిషన్ రద్దు పేరుతో సర్టిఫికెట్ల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ మరి ఫీజులు గుంజుతున్న పరిస్థితి కార్పొరేట్ విద్యాసంస్థలలో నెలకొన్నది, మరి ఇంత  విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడకుండా కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు పలుకుతూ ప్రజా వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసే విధంగా ఈనాడు కెసిఆర్ ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రతి ఒక్క పేద మధ్య తరగతి విద్యార్థికి 50 శాతం ఫీజును ప్రభుత్వమే భరించాలని ఎస్ఎఫ్ఐ గా  ప్రభుత్వాన్ని కోరుతున్నాము, విద్యా సంస్థలలో  పుస్తకాల దందా విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదు, ఈ పుస్తకాల దందా విషయంలో విద్యాశాఖ అధికారులు ప్రతి ఒక్క విద్యా సంస్థను  తనిఖీ చేసి ఇష్టానుసారంగా అధిక రేటుకు పుస్తకాలు అమ్ముతున్న విద్యాసంస్థలను రద్దు చేయాలని అదేవిధంగా అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పై వెంటనే చర్యలు తీసుకోవాలని జీవో 46 ను అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాము ఫీజుల విషయంలో ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వ వ్యతిరేక  ప్రజా విద్యార్థి ఉద్యమాలను చేపడతామని అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల మాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రకాంత్ ,పరమేశ్వరి ,నాయకులు గణేష్ ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు..

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు..

పాల ధ‌ర‌లూ భారీగా పెంచాల‌ని నిర్ణ‌యం

 ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్వంటగ్యాస్, ఉల్లి ధరల పెంపు

మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరుగుద‌ల‌

మార్చి 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం

దేశ వ్యాప్తంగా ప్ర‌భావం

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

 సామాన్యుడి మీద పాల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డ‌నుంది. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరల‌తో పాటు ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దాని ప్ర‌భావంతో  దేశంలో కూడా  పాల ధరలు భారీగా పెర‌గ‌నున్నాయి. జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  రాట్లంలో పాల ధరలు పెంచాల‌ని అక్క‌డి ప‌లు సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ నెల 23న ఆయా సంఘాలు స‌మావేశం నిర్వహించి పాలు లీటరుపై రూ.12 పెంచాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు అధికారుల అనుమతితో వ‌చ్చేనెల 1 నుంచే ఈ ధరల‌ పెంపును అమలు చేయనున్నారు. ఇప్ప‌టికే అధికంగా ఉన్న పాల దొర కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తే లీటరుకు రూ .55కు చేర‌నుంది.  ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.43గా ఉంది. నిజానికి గత ఏడాదిలోనే పాల ధరలు పెంచాల‌ని ఉత్పత్తిదారులు డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వారి నిర్ణ‌యం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ర‌వాణాకూ అధిక ఖ‌ర్చు అవుతోంది. దీంతో పాల‌ ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు అక్క‌డి ఉత్పత్తిదారుల అసోసియేషన్ ప్ర‌క‌టించింది.

సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​ - భారత్​ కు చైనా ప్రతిపాదన

 సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​ - భారత్​ కు చైనా ప్రతిపాదన

 దాని ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగిద్దామని సూచన

బలగాల ఉపసంహరణపై సంతృప్తి వ్యక్తం చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ

మాస్కో ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్

హింస ద్వారా శాంతికి భంగం కలిగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక

చైనా దుందుడుకు వైఖరితోనే రెండు దేశాల బంధాలు దెబ్బతిన్నాయని స్పష్టీకరణ

75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్న ఇరు దేశాల మంత్రులు

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలి ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చైనాకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న అన్ని ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇరుపక్షాలూ బలగాలను తగ్గించుకోవాలని, శాంతి సామరస్యాల పునరుద్ధరణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు ఓ హాట్ లైన్ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. గురువారం రెండు దేశాల విదేశాంగ మంత్రులు దాదాపు 75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. చర్చలకు సంబంధించిన వివరాలను శుక్రవారం విదేశాంగ శాఖ వెల్లడించింది.మాస్కో ఒప్పందానికి కట్టుబడాలి : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ సదస్సు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ లో ఇరు దేశాల మధ్య కుదిరిన (మాస్కో) ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందిగా చైనాకు జైశంకర్ తేల్చి చెప్పారు. సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు వైఖరి వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సరిహద్దు సమస్య తీరేందుకు సమయం పట్టొచ్చని, కానీ, దాని కోసం హింస ద్వారా శాంతి సామరస్యాలను పాడు చేస్తే ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకోవాలన్న మాస్కో ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. చర్చలు కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. కాగా, ప్రస్తుతం బలగాల ఉపసంహరణపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి సామరస్య పునరుద్ధరణలో ఇది ముఖ్యమైన అడుగు అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఫలితాలను ఇరుపక్షాలూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణను మరింత మెరుగు పరచాల్సిన అవసరముందన్నారు. అప్పట్లో భారత్ మూడు పరస్పర సహకార సూత్రాలను ప్రతిపాదించిందని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, పరస్సర ప్రయోజనాలు, పరస్పర సున్నితాంశాలకు రెండు దేశాలూ కట్టుబడాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని, సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు చర్చల కోసం ఓ ‘హాట్ లైన్’ను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.


గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

గర్భిణిని దహనం చేసిన బూడిదలోని నగల అవశేషాలను దొంగిలించటానికి ప్రయత్నించి నలుగురు అడ్డంగా బుక్కయ్యారు. గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆలస్యంగావెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మరణించిన ఓ గర్భిణి అంత్యక్రియలు బంగారు నగలు మృతదేహంపై ఉంచి చేస్తారని వారికి తెలిసింది.  గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో కరిగిన బంగారాన్ని దొంగిలించాలని వారు నిశ్చయించుకున్నారు. బుధవారం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో నగల అవశేషాల కోసం వెతకుతూ.. గ్రామస్తుల కంట బడ్డారు. దీంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఓ గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...