Followers

ట్రాలీల బంద్ విజయవంతం

 ట్రాలీల బంద్ విజయవంతం

లక్షెట్టిపెట్,పెన్ పవర్




పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగినందుకు పట్టణంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టినా త్రీ,ఫోర్ విల్ ట్రాలీల బంద్ సోమవారం విజయవంతం అయ్యింది. ట్రాలీల డ్రైవర్లు ఓనర్లు తమ వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.కరీంనగర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ర్యాలీ అనంతరం వాహన డ్రైవర్లు ఓనర్లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో డ్రైవర్లు ఓనర్లు వెంకటేష్ గౌడ్,సుధాకర్, నగేష్,రమేష్,రఫిక్ మరికొంత మంది డ్రైవర్లు ఓనర్లు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

 ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

మందమర్రి, పెన్ పవర్ 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల వద్ద పన్నులు వసూలు చేస్తూ వారిని ఓటు బ్యాంకు లాగా వాడుకుంటున్నారని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మందమర్రి పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేడి రాజు ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోజువారి వచ్చే రెండు వందల నుండి నాలుగు వందల రూపాయల సంపాదనతో చాలీచాలని జీవితం గడుపుతూ ఆటోడ్రైవర్లు ఇంటి అద్దెలు, కరెంట్, వాటర్ బిల్లులు, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్య పరిస్థితులు చూసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని, దీనికి తోడు లాక్ డౌన్ వలన ఆగిపోయిన ఆటో కిస్తీలు కట్టలేక,దినదినం ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు, ఆటో స్పేర్ పార్ట్స్ ధరల పెరుగుదలతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి మార్చి 5న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగిందని బంద్ కు ప్రజలందరూ మద్దతు తెలిపి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి,ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయాలని డిమాండ్ చేశారు.పెరిగిన ధరలను తగ్గించి,పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆటోడ్రైవర్లకు ఇచ్చినట్లు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు.పర్మిట్ పూర్తయిన పాత ఆటోలను గుర్తించి వాటి స్థానంలో కొత్త ఆటోలను ఇచ్చి ఆదుకోవాలని, ఫైనాన్స్ వేధింపులను అరికట్టి, బ్యాంకులలో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్లు సహజంగా చనిపోతే 15 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 25లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా అన్ని జిల్లా,పట్టణ,మండల కేంద్రాలలో ఆటో నగర్ లు ఏర్పాటు చేసి,ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిర్వహించు జిల్లా వ్యాప్త బంద్ కు జిల్లాలోని ఆటో డ్రైవర్లు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి, స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఉప్పరి సుభాష్, కొప్పుల రమేష్, కోశాధికారి ఎండి షరీఫ్, ప్రచార కార్యదర్శి దాసరి రాజ్ కుమార్, కార్యదర్శి బొల్లు రవి,ఆటోడ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

నేల రాలిన మరో ప్రైవేటు టీచర్

 నేల రాలిన మరో ప్రైవేటు టీచర్                                            

సూర్యాపేట,పెన్ పవర్



విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిభారత పౌరులుగా మార్చే శక్తిసామర్థ్యాలు గల టీచర్ల భవిష్యత్తు నేడు అగమ్యగోచరంగా మారింది అనడానికి మరొక ఉదాహరణ. అనాజిపురం మోడల్ స్కూల్ లో గత 4 సంవత్సరాలుగా PGT (తెలుగు పండిట్) గా  సేవలందిస్తూ  వస్తున్న సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన జానపాడు సైదులు (43) అనే ప్రైవేట్ టీచర్ ఆర్థిక ఇబ్బందులతో గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. 

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పటినుండి గత 11 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, రోజు కూలీ పనికి వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న జానపాటి సైదులు గారు, పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ హెచ్ బీ టీ లను ప్రభుత్వం ఇంకా విధుల లోనికి తీసుకోకపోవడం వలన మనస్థాపానికి గురై గుండెపోటుతో అకాల మరణం చెందారు. సైదులు గారి మరణ వార్త తెలుసుకున్న టి పి టి ఎఫ్ నాయకులు వారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ  ఇప్పటికైనా ప్రభుత్వం  ఆదుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న      టి పి టి ఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ  ప్రైవేట్ టీచర్ల ను ఆదుకోవాలని గత కొన్ని నెలలుగా అనేక పోరాటాలు చేసినప్పటికీ  ప్రభుత్వం గానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, యాజమాన్యాలు కానీ ఎవరూ కూడా తమ బాధలను పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం పట్టభద్ర ఎన్నికలు ఉన్నాయి కావున ప్రైవేట్ టీచర్లను కేవలం తమ ఓటు బ్యాంకు  రాజకీయాల కొరకు వాడుకోవడం కొరకు మాత్రమే 6,7, 8 తరగతులను ప్రారంభించారు తప్ప ప్రైవేట్ టీచర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ఘనంగా బ్రహ్మంగారి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం

 ఘనంగా బ్రహ్మంగారి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం





రాజన్న సిరిసిల్ల బ్యూరో,పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోరాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి 5వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా సోమవారం రోజున బ్రహ్మంగారి గోవిందంబల కళ్యాణ మహోత్సవం ఒడిబియ్యం సమర్పణ హోమం పూర్ణాహుతి మరియు ఉత్సవమూర్తులకు విశ్వ బ్రాహ్మణ పురోహితులు రాగి దేవేందర్ చారి కొత్తపెల్లి రాజు పంతులు పూజలు ఘనంగా నిర్వహించారు  కార్యక్రమంలో మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ కులాల పెద్దలు బ్రహ్మంగారి ఆలయ కమిటీ రాచర్ల బొప్పాపూర్ అధ్యక్షులు వంగాల వసంత్ కుమార్ చారి కమ్మరి లక్ష్మణ్ చందనం రాజు శ్రీనివాస్ చారి వంగాల నాగభూషణం చారి శ్రీరామోజు భాస్కర్ చారి దుంపటి కృష్ణమూర్తి చారి మండోజు రాజయ్య చారి మరియు ఐదు కులాలు సంబంధించిన కుల సభ్యులు పాల్గొన్నారు స్వర్ణకార సహకార సంఘం అధ్యక్షుడు వంగాల నాగభూషణం తన చేతులతో మొక్కలు నాటి  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గుడి ముందు కానీ గృహం ముందు కానీ రోడ్డు పక్కన గాని మొక్కలు నాటిన చొ మొక్క వృక్షమై మానవాళికి నీడనిస్తుంది కాలుష్యాన్ని నివారిస్తుంది అన్నారు బ్రహ్మంగారి గుడి కూడా దినదినం అభివృద్ధి చెందాలని మరియు 5 కులాలు సమిష్టిగా కలిసి మన కులదైవమైన యావత్ ప్రపంచానికి మున్ముందు జరిగే విషయాలను కాల జ్ఞానం ద్వారా వివరించి ఆదర్శంగా నిలిచిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మంగారి  గుడిని అభివృద్ధి చేయాలని మనమందరము సమిష్టిగా పని చేయాలని అన్నారు

చేతివృత్తుల వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి జగదీష్ రెడ్డి

 చేతివృత్తుల వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి జగదీష్ రెడ్డి      

 సూర్యాపేట/పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కొరకు సీఎం కేసీఆర్ పాలనలో అనేక పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పద్మశాలి భవనం లో ఆదివారం జరిగిన ప్రపంచ టైలర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన అన్నిరకాల చేతి వృత్తుల వారికి తమ ప్రభుత్వం అండగా నిలించిందని, తెలంగాణ రాష్ట్రములో కుల వృత్తులు, చేతి వృత్తుల పునరుజ్జీవం జరిగిందని ఆయన అన్నారు. ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశం అయితే, కుట్లు అల్లికల ద్వారా బట్టలు కుట్డి అందించిన దర్జీలు గొప్పవారని ఆయన అన్నారు. మేరు సంఘం వారికి కుట్టు మిషన్ లు అందజేయడం జరిగిందని.. త్వరలోనే మిషన్ కుట్టే ఇతర కులాల వారికి కూడ కుట్టు మిషనులు అందజేస్తామని ఆయన అన్నారు. టైలర్స్ దుకాణాలకు విద్యుత్ సబ్సిడీ విషయంలో పేదవారికి మాత్రమే అదేవిధంగా చూడాలని మంత్రి అన్నారు. జిల్లా టైలర్స్ &ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. నీడ్స్ టైలర్స్ క్లాత్ షోరూం దూలం నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సంఘం అధ్యక్షులు మహేష్, సీపీఐ  నాయకులు, కేవీఎల్, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి, పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్, పాండురంగా చారి, సంఘం ప్రధాన కార్యదర్శి కర్నే ఉపేందర్. కోశాధికారి దేవిరెడ్డి వీరారెడ్డి. జాన్ టెక్స్టైల్స్ విజయ కుమార్ శ్రీనివాస్, రమేష్, టైలర్స్, దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతర సెక్యూరిటీ పరిశీలించిన ఎస్పీ

 పెద్దగట్టు జాతర సెక్యూరిటీ పరిశీలించిన ఎస్పీ 


              

  సూర్యాపేట,పెన్ పవర్

పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్త ను సెక్యూరిటీ ఏర్పాటు లు జిల్లా ఎస్పీ  భాస్కరన్ పరిశీలించారు. సీసీ టీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ.. జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తును ఏర్పాటు చేసామని అన్నారు. జాతర ప్రాంగణంలో, జాతీయ రహదారిపై, గట్టుపై మొత్తం 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినామని, జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణలో ఉంచాం అన్నారు. మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్ ను, మఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అని కోరారు. అనుమానిత వస్తువులను తకావద్దు అన్నారు. పోలీసు వారు చూపిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. క్యూ లైన్స్ పాటించాలి, బారికేడ్స్ దాటుకి రావద్దు అన్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తుంచవద్దు, గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు అని అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్సవాన్ని ఆనందించాలి అన్నారు.

జాతరకు వచ్చే భక్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలి

 జాతరకు వచ్చే భక్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలి



అదికారులు సమన్వయంతో  కలసి పనిచేయాలి.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

  సూర్యాపేట,పెన్ పవర్

ఆదివారం అర్థరాత్రి ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుండి వేలాదిమంది తరలి వస్తున్నారు.సోమవారం  జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పెద్దగట్టు దేవాలయం వద్ద అధికారులతో కలిసి స్వయంగా జాతర ను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటి కప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. జాతర లో  పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.    జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ తో  చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ కాలుష్యం లేకుండా ప్లాస్టిక్  రహిత జాతర గా నిర్వహించేందుకు  భక్తులు జిల్లా యంత్రాంగం తో సహకరించాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...