Followers

ఎమ్మెల్యే రాజసింగ్ ను అరెస్ట్ చెయ్యాలి

 ఎమ్మెల్యే రాజసింగ్ ను అరెస్ట్ చెయ్యాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ నాయకులు గుండెల్లి  కళ్యాణ్ కుమార్. 

గంభీరావుపేట ,పెన్ పవర్  

 రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట  మండలం కేంద్రం లో  సోమవారం దళితులను దూషించిన ఎమ్మెల్యే రాజేసింగ్ ను అరెస్ట్ చెయ్యాలి గంభీరావుపేటమండల కేంద్రలో విలేకరుల సమవేశంలో గుండెల్లి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.

గోషామహల్ ప్రాతంలో ఒక సభలో పాల్లొగాన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహా వీయతను మరిచిఆవుమాంసం తినే కొడుకులు అంటూ అంతనికి  నోటికివచ్చిన మాటలుమాట్లాడిదళితులనుకించాపేర్చే విధంగా  మాట్లాడం సరియిన పద్దతి కాదు నోరు అదుపులో పెట్టుకొనిమాట్లాడండి.

రాజ్యాంగం పై  ప్రమాణం చేసిన రాజాసింగ్  రాజ్యాంగవ్యతిరేకంగా సంస్కరహీనుడుగా మాట్లాడడం 

బి జె పి దళితులను టార్గెట్ చేసుకొని భూతులు తిట్టడం

దాడులు చేయడం పద్ధతి కాదు 

ఇక నుంచి  పద్దతి మార్చుకొని

గతం లో కూడా రెచ్చ గొట్టే విధంగా మాట్లాడినారు.

ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నాము

రానున్న రోజులో ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరిస్తూన్నాము 

మీ పద్దతి మార్చుకోకపోతే .



పంచాయతీ లో అడుగుపెట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు

 పంచాయతీ లో అడుగుపెట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు



 పెన్ పవర్,కొవ్వూరు

 కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకులు గారపాటి వెంకట కృష్ణారావు  మరియు ముళ్ళపూడి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో గెలిచిన  సర్పంచి నెరేడుమిల్లి నాగమణిw/o నాగేశ్వరరావు ఉప సర్పంచ్ వెంపాటి యుగంధర్ రావు మరియు వార్డు మెంబర్లు అందరూ సోమవారం పంచాయతీ లో అడుగు పెట్టి వారికి కేటాయించిన  సీట్లో కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంపాటి యుగంధర్ మాట్లాడుతూ ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని ఇచ్చిన హామీలు  నెరవేరుస్తామని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం టిడిపి సీనియర్ నాయకులు గారపాటి వెంకట కృష్ణారావు , ముళ్లపూడి రాజేంద్ర ప్రసాద్,  జలెం చిరంజీవి, సరిపల్లి గంగరాజు మరియు నాయకులు కార్యకర్తలు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పిల్లలకు మాస్కులు పంపిణీ...

పిల్లలకు మాస్కులు పంపిణీ...


గోకవరం,పెన్ పవర్
మండలంలోని రంప యర్రంపాలెం గ్రామంలో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకు గ్రామస్తులు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. రంప యర్రంపాలెం గ్రామములోనిదేవి సెంటర్ లో గల ఎమ్ పి పి పాఠశాల లోని 200 మంది పిల్లలకు ఎస్ సి పేట లోని అంగన్వాడి సెంటర్ లో ఉన్న 35 మంది పిల్లలకు స్థానిక టైలర్ పంతం సత్యనారాయణ స్వయంగా మాస్కులు కుట్టి గ్రామ సర్పంచ్ బాదంపూడి హర్షిత, ఉప సర్పంచ్ దాకా రుపు ధర్మరాజు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాదంపూడి ప్రకాష్, గంధం బాబురావు, అల్లాడి సింహాచలం, ఉపాధ్యాయులు అంగన్వాడీ సిబ్బంది, టి. బుజ్జమ్మ, కె. పాపాయమ్మ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం

చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం



గోకవరం పెన్ పవర్

గోకవరంమండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక పాతగుబ్బలమ్మవారి గుడివీధి లో చిన్ననాటిస్నేహితుల సమక్షంలో ఘనసన్మానంనిర్వహించడం జరిగింది రంపచోడవరం క్లస్టర్ లో S E B  హెడ్ కానిస్టేబుల్ గా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్న అరసాల రాజేంద్రప్రసాద్ నకు ప్రభుత్వం వారు రంప విశ్వభూషన్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది జిల్లా ప్రధమ పౌరుడు కలెక్టర్ చేతుల మీదుగా తీసుకొనుటవలన అది తెలుసుకొనిన చిన్న నాటి స్నేహితులు ఉద్యోగాల పరంగా ఆయా పట్టణాలలో గ్రామా లలో స్థిరపడిన వీరు పెరిగినటు వంటి పాతగుబ్బలమ్మవారి గుడివీధి లో ఘనమైన సత్కారం రాజేంద్రప్రసాద్ నకు చేసియున్నారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొంటు చిన్న నాటి  స్మతులను పదిమందికి చెబుతూ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు డిపార్ట్మెంట్ లో తాను చేసిన సర్వీస్ ను మెచ్చుకొంటు ఈ అవార్డ్ తెచ్చినందుకు చాలా సంతోషంగా  ఉందని మన కలయిక అపురూపమని ఎన్నటికీ విడిపోము అని ఉద్వేగభరితులై తెలియచెప్పారు ఈ కార్యక్రమంలో పెరువలి చిన్నారావు పిల్లి చిరంజీవి గోలి బాబ్జి పెరువలి మోహనరావు గోన్నూరి లాజర్ చిగురుపల్లి రాజు చింతాటి అప్పారావు గంపల భజని అరసాల జూన్ ప్రసాద్  పెరువలి దొరబాబు మోర్త చిట్టిబాబు  మరియు అధికస్థాయిలో పెద్దలు మహిళలు పాల్గొనియున్నారు.

విశాఖలో జనసేనాని ప్రచారం

 విశాఖలో జనసేనాని ప్రచారం 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో పర్యటించాలని పవన్ నిర్ణయం

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు

పార్టీ గుర్తులపై ఎన్నికలు

ప్రచారానికి పవన్ వస్తే బాగుంటుందన్న విశాఖ ప్రాంత నేతలు

సమ్మతించిన జనసేనాని

రెండ్రోజుల్లో తేదీ ఖరారు

విశాఖపట్నం, పెన్ పవర్ 



జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున  విశాఖలో కీలక నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీ లోపు తన పర్యటన ఉండొచ్చని పవన్ తెలిపారు. మరో రెండ్రోజుల్లో పర్యటన తేదీ ప్రకటిస్తానని వివరించారు.ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఉనికిని చాటుకోవడం పవన్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో మరింత బలంగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి తగిన సమయం అని అన్నారు.కొన్నిరోజుల కిందట పవన్ విశాఖ ప్రాంత జనసేన ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి పవన్ వస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడగా, పవన్ అందుకు సానుకూలంగా స్పందించారు.

ఏరియాలో 59 శాతం బొగ్గు ఉత్పత్తి

 ఏరియాలో 59 శాతం బొగ్గు ఉత్పత్తి

ఏరియా జిఎం చింతల శ్రీనివాస్

కళ్యాణిఖని,పెన్ పవర్ 

మందమర్రి ఏరియాలో ఫిబ్రవరి మాసంలో  59 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.ఫిబ్రవరి మాసంలో ఏరియాలోని  కేకే-1 గని 100శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 72శాతం,ఆర్కే 1ఎ గని 91శాతం,కాసిపేట గని 52శాతం,కాసిపేట-2 గని 15శాతం,శాంతిఖని గని 48శాతం,కేకే ఓసిపి 114శాతం, ఆర్కే ఓసిపి 21శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.ఫిబ్రవరి నెలలో అండర్ గ్రౌండ్ గనుల ద్వారా 53 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 61 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అధికంగా 2.75 లక్షల టన్నుల నెలవారీ ఉత్పత్తి,11462 టన్నుల రోజువారీ ఉత్పత్తిని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా ఫిబ్రవరి నెలలో 2.04 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా, రైలు మార్గం ద్వారా 48 రేకులకు గాను 1.94 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు,18.17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన వివరించారు.2020-21ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియా వార్షిక లక్ష్యంలో 47శాతం సాధించగా,17.15లక్షల టన్నులు బొగ్గును రవాణా చేసినట్లు, రైలు మార్గం ద్వారా 409 రేకులకు గాను 16.35లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి,205.83లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్,డిజిఎం(ఐఇడి) రాజన్న,డివైపిఎం శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.

శివారెడ్డి పల్లిలో క్రకెట్ట టోర్నమెంట్ ను ప్రారంభించిన రామ్మోహన్ రెడ్డి

 శివారెడ్డి పల్లిలో క్రకెట్ట టోర్నమెంట్ ను ప్రారంభించిన రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, పెన్ పెన్ పవర్


అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి  మాతృమూర్తి స్వర్గీయ సుకన్య దేవి  మెమోరియల్ క్రికెట్ టౌర్నమెంట్  ను దోమ మండలం శివరెడ్డిపల్లి గ్రామంలో మొదటి క్రికెట్ మ్యాచును టాస్ వేసి ప్రారంభించిన  రామ్మోహన్ రెడ్డి 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మాఅమ్మ నన్ను చాల బాగ చూసుకొనేదని  అమ్మ ప్రేమను మించింది ఏది లేదు..మా అమ్మ అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధను కలిగించింది. ఈ రోజు వారి పేరుమీద సర్పంచ్ నరేందర్ రెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకం, గ్రామీణ క్రీడాకారులు ఇలాంటి క్రీడా అవకాశాల్ని వ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు,  రామచంద్ర రెడ్డి,తమన్నగారి అనంత రెడ్డి, యాదవ రెడ్డి, శాంతు, బాల్ రెడ్డి, సర్పంచ్ అశోక్ రెడ్డి,హన్మంతు ముదిరాజ్, ఎరగడ పల్లి కృష్ణ,హైమద్, శ్రీకాంత్ రెడ్డి,  ఆంజనేయులు,జగన్, అక్బర్, సర్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...