Followers

పెద్దగట్టు జాతరను సందర్శించిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం

 పెద్దగట్టు జాతరను సందర్శించిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం                       
   
సూర్యాపేట,పెన్ పవర్

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరవగా..ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఘన స్వాగతం పలికి అనంతరం శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని అన్నారు. జాతరకు వచ్చిన భక్తజనంపై లింగమంతుల స్వామి  ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సూర్యాపేట ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం

 సూర్యాపేట ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం                                     

 సూర్యాపేట,పెన్ పవర్

సూర్యాపేట ఖమ్మం రహదారి చివ్వెంల మండల శివారులోని రవీంద్ర ఫార్బాయిల్ పక్కన మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చివ్వెంల మండలం మున్యా నాయక్ తండ కు చెందిన రాముగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణికి ఓటు వేసి గెలిపించాలి

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణికి ఓటు వేసి గెలిపించాలి

వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, పెన్ పవర్



ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి నిలబడిన అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ సురభి వానికి తాము ఓటు వేసి గెలిపించాలని ఎకేఆర్ స్టడీ సర్కిల్ లో మూడు వందల మంది విద్యార్థులతో ఆయన మన సమావేశం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. భవిష్యత్తులో వికారాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్సీగా ఎన్నికైన బెడ్ తోటి ఎన్ని నిధులు అయినా తీయవచ్చని వికారాబాద్ ఎమ్మెల్యే విద్యార్థులను కోరారు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థుల సాధకబాధకాలను తెలుసుకున్నాడు పార్టీ అభ్యర్థి మహిళా కావడం చాలా అదృష్టం అని, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి లోకి వచ్చిన తర్వాత వికారాబాద్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని. వికారాబాద్లో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతోపాటు వికారాబాద్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలను అవసరాలు సమస్యలను తీర్చడంలో టిఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందని అందువల్ల విద్యార్థులు మరొక్కసారి ఆలోచన చేసుకొని, సురభి వాణి దేవికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు



ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో

 ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో



 పెన్ పవర్ ఆత్రేయపురం

 ఆత్రేయపురం మండలం మండల కార్యాలయం నందు ఈరోజు నిర్వహించిన ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో  ఎంపిడిఓ నాతి  బుజ్జి మాట్లాడుతూ  ప్రతి గ్రామంలోని ఉపాధి హామీ పనులు జరగాలని కొత్త పనులు గుర్తించి ఆ గ్రామాల్లో ఉపాధి నెలకొనేలా పనులను చేపట్టాలని   ఉపాధి హామీ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగినది అలాగే వేతనదారులు సంఖ్య పెంచాలని ఉపాధి హామీ పనులు గుర్తించినప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆ గ్రామాలలో పంట పొలాలకు నీరు వెళ్లే కాలువలు కూడా  గుర్తించి రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆమె సూచించడం జరిగింది  ఈ సమావేశంలో మండలంలో ఉన్న ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.



ఎన్నికల రూల్స్ కచ్చితంగా పాటిస్తాం...మళ్ళ సురేంద్ర

 ఎన్నికల రూల్స్ కచ్చితంగా పాటిస్తాం ...మళ్ళ సురేంద్ర



అనకపల్లి , పెన్ పవర్ 

నేటి నుండి ఎన్నికల రూల్స్ పాటిస్తూ కేవలం ఐదు మంది లోపే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని  నేడు అనకాపల్లి పట్టణం 81వ వార్డు డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి  శ్రీమతి మళ్ళ కృష్ణ కుమారి  మరియు మళ్ళ సురేంద్ర  ఇంటింటి ప్రచారం నిర్వహించారు, స్థానిక గవరపాలెం దిబ్బ రామాలయం గుడి వెనకాల ప్రచారం నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా 81వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  మళ్ళ సురేంద్ర గారు మాట్లాడుతూ  ప్రజల అందరి దగ్గర మంచి స్పందన వస్తుందని ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు నిత్యవసర సరుకులు ధరలన్నీ ఆకాశం అందడంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక రేటు 3500 అని చెప్పి నేడు 18000 తీసుకుంటున్నారని ఇలా ఎన్నో సమస్యలపై ప్రజలందరూ కూడా మళ్ళ సురేంద్ర కి వివరించారు ఈ సందర్భంగా  మళ్ళ సురేంద్ర   మాట్లాడుతూ కచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు గెలుచుకుంటామని మేయర్ పీఠం సాధిస్తామని మేము వచ్చిన తర్వాత వందకి 100% చక్కటి మంచినీటి అందిస్తామని చక్కగా పారిశుద్ధ నిర్వహిస్తామని ఎక్కడ వాటర్ ట్యాంక్ లో ఉన్న మరమ్మత్తులు చేసి అన్ని పని చేసే విధంగా పని చేస్తామని ప్రతి పేదవాడికి ఒక పరిధి లో ఏమేమి ఉంటాయో అన్నీ చేస్తామని తెలియజేస్తూ ఎన్నికల సంఘం వారికి అధికారులకి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ రూల్స్ అన్ని పాటిస్తామని మళ్ళ సురేంద్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెతకం చెట్టి వెంకట్రావు, బాల, శిల్ప శెట్టి శ్రీనివాసరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

గోవిందమాల దీక్ష స్వీకరించిన స్వామిలకు నూతన వస్త్రాలు

 గోవిందమాల దీక్ష స్వీకరించిన  స్వామిలకు  నూతన వస్త్రాలు 




పెన్ పవర్,ఆత్రేయపురం

ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో వెలసిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర  స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత ఈ గ్రామం లో కొలువై ఉన్నాడు  ఈరోజు మరి కొందరు మంది గోవింద మాల దీక్ష స్వీకరించారు ఈ గోవిందమాల స్వీకరించిన స్వామికి ఆలయం తరఫున నూతన వస్త్రములు దీక్ష మాలలు  కార్యనిర్వహణాధికారి ముదునూరు సత్యనారాయణరాజు  ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఆ కలియుగ వైకుంఠ వాసుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన కొవ్వూరి శరవణ కృష్ణ విఖ్యత్  ఆ స్వామివారి నిత్య అన్నదానానికి 10,000/- రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ కలియుగ వైకుంఠ వాసునిగా చిత్రపటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.


పరిగి న్యాయ వాదుల రిలే నిరాహారదీక్ష

 పరిగి న్యాయ వాదుల రిలే నిరాహారదీక్ష

 వికారాబాద్: జిల్లా, పెన్ పవర్


వికారాబాద్ జిల్లా పరిగి  తరఫున న్యాయవాదుల రక్షణ చట్టం సాధనకై రెండో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన న్యాయవాదులు. ఈ రిలే నిరాహార దీక్షకు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలపడం తెలిపారు.

అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము యాదవ్ మాట్లాడుతూ వామన్ రావు దంపతులను అందరూ చూస్తుండగానే నరికి చంపడం చాలా దారుణం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరినారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల న్యాయవాలప్తె నమ్మకం పోతుందని రాములు యాదవ్ అన్నారు . లేదంటే మార్చి 9న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వస్తామని హెచ్చరించడం జరిగింది. సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగాలని న్యాయవాదుల దగ్గరకు వస్తారని అలాంటి న్యాయవాదుల కి అన్యాయం జరిగితే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుటకు ఏవిధమైన పోరాటం చేసినమో ఈ రక్షణ చట్టం తేవడానికి  కి కూడా అలాగే పోరాటం చేస్తామన్నారు.  ఆనంద్  గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉన్నదని న్యాయ స్దానం కు వస్తె తమకు న్యాయ జరుగుతుందని నమ్మి వస్తారని అన్యాయం ప్తె పోరాడితే అలాంటి న్యాయ వాదులను బెదిరించడం దారుణమని నడి రోడ్డు ప్తె దారుణంగా హత్య చేసిన వ్వక్తుల కఠినంగా శిక్షించాలని అనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాది   బి.లింగం , గౌస్ పాష, రవీందర్ , శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...