Followers

బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.

 బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి...

బీజేపీ మండల ఇంచార్జీ కొండారె రమేష్ 

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్), పెన్ పవర్ 

 బీజేపీ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల కమిటీలు పూర్తిచేసి

పోలింగ్‌బూత్‌ స్థాయి వరకు బలోపేతం చేయాలని బీజేపీ మండల ఇంచార్జీ కొండారె రమేష్అన్నారు. మంగళవారం,మండలకేంద్రంలోని స్థానిక రాధాకృష్ణ ఆలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆరేళ్లీ రాజలింగు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామ సమస్యలపై పూర్తి దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు శిక్షణ ఒక ముఖ్యభాగం, మండలస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు శిక్షణ తరగతులు క్రమం తప్పకుండా చేపట్టడం, పార్టీ నిరంతరం నిమగ్నమైందన్నారు. మండలస్థాయి శిక్షణ తరగతులు మార్చి 15లోపు పూర్తిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల ఎంపిపి పోటె శోభాబాయి, వైస్ ఎంపిపి పడ్వాల్ గోపాల్ సింగ్, ఎంపిటిసి సభ్యులు మడావి భీంరావ్, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు, మరప రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిడాం భీంరావ్, ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గేడం భారత్, ఉపాధ్యక్షుడు రాథోడ్ భీంరావ్, బీజేపీ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖను అభివృద్ధి చేసే బాధ్య‌త వైసీపీ తీ‌సుకుంటుంది...విజయసాయి రెడ్డి

విశాఖను అభివృద్ధి చేసే బాధ్య‌త వైసీపీ తీ‌సుకుంటుంది...విజయసాయి రెడ్డి



వైద్య రంగంలో జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారు

ఇవ్వని హామీలను కూడా జగన్ నెరవేర్చారు

సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందించాలనేది జగన్ లక్ష్యం

పెన్ పవర్,విశాఖపట్నం        
                                                                                   
   ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమని వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని 94వ వార్డు, 95వ వార్డు, వేపగుంట, పాపయ్యరాజుపాలెం ఏరియాలలో విజయసాయిరెడ్డి, మంత్రులు కుర‌సాల క‌న్న‌బాబు, అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ త‌దిత‌రులు గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్ర‌చారం నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా విజ‌య‌‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ నెరవేర్చారని పేర్కొన్నారు. వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందజేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం వైయ‌స్‌ జగన్‌.. నాడు-నేడు ద్వారా విద్యా ప్రమాణాలను పెంచారని విజ‌యసాయిరెడ్డి తెలిపారు. విశాఖ న‌గ‌రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్య‌త వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీ‌సుకుంటుంద‌ని చెప్పారు.


ముస్లిం మహిళ మృతి..అనాథగా మారిన చిన్నారి

 ముస్లిం మహిళ మృతి..అనాథగా మారిన చిన్నారి


సూర్యాపేట,పెన్ పవర్ 

సూర్యాపేట జిల్లా కేంద్రం 30వ వార్డులో ఒక అనాథ  ముస్లిం మహిళ అనారోగ్యంతో మంగళవారం చనిపోయింది. ఆ మహిళకు చిన్న పాప అనాథ అయిన సందర్భం చూపరులను కంటతడి పెట్టించింది. 30వ వార్డు బీజేపీ  కౌన్సిలర్ పలస మహాలక్ష్మి మల్సూర్ గౌడ్ చేరుకొని ఆ పాపను అక్కున చేర్చుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కి ,మున్సిపల్ సిబ్బందికి మరియు సఖి సిబ్బందికి విషయం తెలియజేసి వారి సహకారంతో చనిపోయిన మహిళ యొక్క చిన్న పాపని సఖి సెంటర్ కి అప్పగించారు. ఆ మహిళా శవాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సహకరించిన మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డికి  మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణి

 రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణి 

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్), పెన్ పవర్


ఇంద్రవెల్లి మండలంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో మంగళవారం రిలయన్స్ ఫౌండేషన్ తరుపున విద్యార్థులకు మాస్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఉట్నూర్ డిస్ట్రిబ్యూటర్ బాలు కేంద్రే మాట్లాడుతూ 2020 సంవత్సరం నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మళ్ళీ 2021లో తిరిగి తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ మళ్ళీ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటి వరకు చాలా మంది ఈ మహమ్మారి కారణంగా చనిపోయారని కావున ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మాస్కులు దరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి శానీటైజార్,లేదా సబ్బుతో చేతులను శుభ్రంగా కడగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వారి ఫౌండేషన్ తరుపున ఉపాద్యాయులతో కలసి 300 మాస్కులు విద్యారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జీయో కంపెనీ జేపీఎం నేరేళ్ళ రామకృష్ణ, జడ్పీ 

ఎస్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గోపాల్ సింగ్ తిలావత్, ఉపాధ్యాయులు ముస్లే సుభాష్ ఉపాధ్యాయులు బృందం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బంద్ గోడపత్రికను విడుదల చేసిన - సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి

 రాష్ట్ర బంద్ గోడపత్రికను విడుదల చేసిన - సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి


పరవాడ,పెన్ పవర్  

  ఈ నెల 5న రాష్ట్ర బందును విజయవంతం చేయాలని గోడ పత్రికను సిఐటియు ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్ సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి ఆధ్వర్యంలో నాయకులు  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ   మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకోవడం అత్యంత దుర్మార్గమని ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈనెల 5న జరిగే బందులో కార్మిక సంఘాల సభ్యులు,అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసన తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్ణం వెంకట్రావు,శ్రీను సత్తిబాబు,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతరలో భక్తులకు కనీస అవసరాలు లేవు:దామోదర్ రెడ్డి

 పెద్దగట్టు జాతరలో భక్తులకు కనీస అవసరాలు లేవు:దామోదర్ రెడ్డి                    సూర్యాపేట,పెన్ పవర్ 

సూర్యాపేట జిల్లాలో జరిగే పెద్దగట్టు జాతరలో ప్రజలకు కనీస అవసరాలు మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం, మాస్కుల పంపిణీ చేయకుండా మున్సిపల్ అధికారులు యాదవ్ ల జాతరను తమ కబంధ హస్తాలకు తీసుకొని కోట్ల రూపాయల అవినీతి చేసారని దీనిపై కలెక్టర్ , ఆ పై ఉన్నతాధికారులకు చర్య తీసుకోవాలని, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కోరారు. మంగళవారం  శ్రీ లింగమంతుల స్వామి దర్శనం చేసుకున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దేవుని గుడి పై కూడా అక్రమాలు టిఆర్ఎస్ పాలనలో జరుగుతుందని తెలియజేశారు.

50 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్

 50 లక్షలు ఎక్స్  గ్రేషియో ప్రకటించాలని డిమాండ్     



పెన్ పవర్ ,కందుకూరు 

కరోనా వ్యాక్సిన్ వికటించి మరణించిన సింగరాయకొండ మండలం కలిక వాయి గ్రామ అంగన్వాడీ కార్యకర్త సునీత కుటుంబాన్ని ఆదుకోవాలని,  50 లక్షలు  ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఉలవపాడు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో కందుకూరు ఆర్టీవో ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో ను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్,  అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఉలవపాడు ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు వాకా. లతా రెడ్డి మాట్లాడారు.

                రాస్తారోకో ను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ సునీతకు జనవరి 20న కరోనా వ్యాక్సిన్ వేశారని, అప్పటి నుండి ఆమె వాంతులతో, జ్వరంతో బాధపడుతున్నారని అనేక హాస్పిటల్స్ లో చికిత్స చేయించినా, లాభం లేకుండా పోయిందని సోమవారం నాడు మరణించిందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వల్లనే చనిపోయిందని,  ఆమె కుటుంబాన్ని ప్రభుత్వమే  ఆదుకోవాలని,50లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు బలవంతపు వ్యాక్సినేషన్ ఆపాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు పద్మజ,.మార్తమ్మ, పీ.వీ శేషమ్మ,.పద్మ, , ప్రసన్న, రమాదేవి, . రాధా, పి. భారతి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...